ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నా బీసీలంటూ.. జగన్‌ కపట ప్రేమ

ABN, Publish Date - Oct 25 , 2024 | 12:50 AM

నా బీసీలంటూ కపటప్రేమను చూపించిన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవితా ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

చొదిమెళ్ళ ఎంజేపీ గురుకుల పాఠశాల తనిఖీ

ఏలూరు టూటౌన్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : నా బీసీలంటూ కపటప్రేమను చూపించిన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవితా ఆగ్రహం వ్యక్తం చేశారు. చొదిమెళ్ళ ఎంజేపీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి మంత్రి సవిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలతో పాటు హాస్టల్‌ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులను వసతి, భోజన సౌకర్యాలు ఎలా ఉన్నా యని ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూట మి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంద న్నారు. గురుకుల పాఠశాలల అభివృద్ధికి ముఖ్య మంత్రి చంద్రబాబు రూ.20 కోట్లు కేటా యించారన్నారు. ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ చొదిమెళ్ళలో 10 ఎకరాల స్థలాన్ని సేకరించి గురుకుల పాఠశాలకు శాశ్వత భవనం నిర్మిస్తామన్నారు. డీఆర్వో పుష్పమణి, బీసీ వెల్ఫేర్‌ అధికారి నాగ రాణి, తహసీల్దార్‌ జీవీ.శేషగిరి, టీడీపీ నేత ఆర్నేపల్లి తిరుపతి ఉన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:50 AM