ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

2గేట్లు ఎత్తి.. సాగర్‌ నుంచి నీటి విడుదల

ABN, Publish Date - Oct 27 , 2024 | 03:20 AM

ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 64,755 క్యూసెక్కుల నీరు వస్తుండగా.

గువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 64,755 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. శనివారం సాగర్‌ రెండు క్రస్ట్‌ గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 16,096 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నీటి మట్టం 589.50 అడుగులు ఉండగా, 310.55 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఔట్‌ఫ్లో 64,755 క్యూసెక్కులుగా ఉంది. కాగా, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం జూరాల నుంచి 78,527, సుంకేసుల నుంచి 26,070 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌ జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 30,952 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 36,600 క్యూసెక్కుల నీటితో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. శుక్రవారం రెండు గేట్ల ద్వారా నీటిని కిందికి విడుదల చేయగా.. శనివారం మూసివేశారు.

- ఆంధ్రజ్యోతి, మాచర్ల రూరల్‌, శ్రీశైలం

Updated Date - Oct 27 , 2024 | 03:21 AM