NTR Death anniversary: ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం: చంద్రబాబు
ABN, Publish Date - Jan 18 , 2024 | 10:46 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా అందరం కదిలి తిరిగి రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా అందరం కదిలి తిరిగి రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతలతో తెలుగునేల అల్లాడుతోందని, ఎన్టీఆర్ ఆనాడు 'తెలుగుదేశం పిలుస్తోంది. రా... కదలిరా!' అని ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకొని 'రా... కదలిరా!' కార్యక్రమానికి పిలుపునిచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘తెలుగు ప్రజలరా! రండి... ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం. ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదాం’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్..
దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. "ఒకే ఒక జీవితం... రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది... తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి.
Updated Date - Jan 18 , 2024 | 10:52 AM