ఎన్టీఆర్‌కు ఘన నివాళి
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:35 PM
పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు.
డోన్, జనవరి 18: పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రజా వైద్యశాల మల్లికార్జున, యువ నాయకులు ధర్మవరం గౌతమ్‌రెడ్డి, భరత్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో రక్తదన శిబిరం నిర్వహించారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో యుగపురుషుడుగా నిలిచిపోయారని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్‌టీ హరున్, అజీజ్, చక్రపాణిగౌడు, మిద్దెపల్లి గోవిందు, యాపదిన్నె సర్పంచ్ రామిరెడ్డి, ఎస్‌ఎండీ రఫి, కుమ్మరి సుధాకర్, మధుసూదన్ రెడ్డి, ఎల్‌ఐసీ శ్రీరాములు, కొచ్చెర్వు రామాంజనేయులు, హుశేన్‌పీరా తదితరులు పాల్గొన్నారు.
డోన్(రూరల్): టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతిని పట్టణంలో నిర్వహించారు. ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు జె.చంద్రశేఖర్, హుశేన్‌పీరా, నగేష్, నాగరత్నం, రాముడు, సిమెంటు మధు, రాజు తదితరులు పాల్గొన్నారు.
బేతంచెర్ల: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకుని బేతంచెర్ల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో పోలూరు బ్రదర్స్ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి టీడీపీ నాయకులు నివాళి అర్పించారు. అనంతరం టీడీపీ ఉపాధ్యక్షులు పోలూరు వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ ఉన్నం ఎల్లనాగయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి, మండల సమన్వయ కమిటి చైర్మన్ ఉన్నం చంద్రశేఖర్, ఉన్నం సుధాకర్, గౌరవ సలహాదారులు కాకర్ల తిరుమలేష్ చౌదరి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవం చాటిన మహానీయుడు ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన నేటికి తెలుగువారి గుండెల్లో బ్రతికే ఉన్నారని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే స్థానిక పాతబస్టాండులో అంగన్‌వాడీల సమ్మె శిభిరాన్ని టీడీపీ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపి ఉన్నం చంద్రశేఖర్ సహకారంతో తేనేటి విందు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మేకల నాగరాజు, జాకీరుల్లాభేగ్, రవీంద్రనాయక్, రూబెన్, కౌన్సిలర్లు రామాంజనేయులు, రామగోపాల్, రామ్మూర్తి, నంద్యాల మధు, జావాజి వెంకటేశ్వర్లు, రమేష్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు శ్రీధర్, సిమెంట్‌నగర్ రాముడు, గూటం శివ, సిమెంటునగర్ వాసు, మల్లిపెద్ది నాగేశ్వరరెడ్డి, వెంకటేశ్, జగదీష్, జనార్దన్, కానాల అంజి, సుంకన్న, నాగరాజు, శ్రీపతి నాగరాజు, దూదేకుల దస్తగిరి, బాషా పాల్గొన్నారు.
ప్యాపిలి: పేదల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని టీడీపీ నాయకులు అన్నారు. గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌ఈ రాఘవేంద్ర, చిన్న సుంకయ్య, గండికోట రామసుబ్బయ్య, పి వెంకటేశ్వరరెడ్డి, రామ్మోహన్‌యాదవ్, సుదర్శన్, ఎస్ మధు, చల్లా వీరాంజినేయులు, నాగేంద్ర, గండకోట పెద్దరామాంజి నేయలు, కలచట్ల ప్రసాద్, రాంపురం నాగేశ్వరరావు, ఏనుగమర్రి రాము తదితరులు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మహనీయుడని మాజీ మంత్రి అఖిలప్రియ కొనియాడారు. ఎన్టీఆర్ వర్థంతిని పురష్కరించుకొని పట్టణంలోని ఆమె స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె రక్తదానం చేశారు. కార్యక్రమంలో తాలుకాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు.
శిరివెళ్ల: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మండలంలోని యర్రగుంట్ల, శిరివెళ్ల, గోవిందపల్లె, బోయలకుంట్ల తదితర గ్రామాల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాజీ సర్పంచ్ కమతం పుల్లారెడ్డి, కమతం లక్ష్మిరెడ్డి, మండ్ల హుసేనప్ప, తాళ్లూరి బుగ్గన్న, తపసి పుల్లయ్య, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, మౌళాలి, అష్రఫ్, ఓబులేసు, కమతం జయరామిరెడ్డి, శీలం లక్ష్మీప్రసాద్, కమతం సుబ్బారెడ్డి, జాకీర్ హుసేన్, జమాల్ బాషా, శీలం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
చాగలమర్రి: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సేవలు చిరస్మరణీయమని టీడీపీ బీసీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి సల్లా నాగరాజు అన్నారు. గురువారం చాగలమర్రి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన సేవల గురించి కొనియాడారు. కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహులు, టీడీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, బషీర్, అబ్దుల్, ఓబులేసు, టైలర్ మాబాషా, చోటు, దస్తగిరి, సుబ్బరాయుడు, కె.రమేష్ పాల్గొన్నారు.
ఉయ్యాలవాడ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బోరెడ్డి శేఖర్‌రెడ్డి, మండల కన్వీనరు కూడాల నారాయణరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గురువారం ఉయ్యాలవాడలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడన్నారు. మండల టీడీపీ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎ.నరసింహుడు, ఆకుల వెంకటసుబ్బయ్య, ఉప్పరవీధి వెంకటేశ్వర్లు, నరసింహుడు తదితరులు పాల్గొన్నారు.
బనగానపల్లె: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీరామారావు వర్ధంతిని బనగానపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బీసీ రామనాథరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. దివంగత ఎన్టీఆర్ చిత్రపటానికి బీసీ రామనాథరెడ్డితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు నందమూరి అభిమానులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 260 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. బీసీ రామనాథరెడ్డి మాట్లాడుతూ రక్తదానంచేసి మరొకరికి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదాతలను అభినందించారు. మిట్టపల్లె సర్పంచ్ తులసిరెడ్డి, బనగానపల్లె ఉపసర్పంచ్ బురానుద్దీన్, రామకృష్ణాపురం శంకర్, ఉగ్రసేనారెడ్డి, బొబ్బల గోపాల్‌రెడ్డి, భూషన్న, కృష్ణానాయక్, మౌలాలి, కాశీంబాషా, సలాం, పక్కీర్‌రెడ్డి, అల్తాప్‌హుసేన్, మౌలాలి, టంగుటూరు శ్రీనయ్య, భాస్కర్‌రెడ్డి, నాగిరెడ్డి, గడ్డం నాగేశ్వరరెడ్డి, కలాం, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, శేషారెడ్డి, ప్రసాద్, బాలనాయుడు, బాస్కర్‌రెడ్డి, లాయర్ నాగేంద్రారెడ్డి, ఖాదర్ పాల్గొన్నారు.
కొలిమిగుండ్ల: కొలిమిగుండ్లలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఎన్టీఆర్ వర్ధంతిని పార్టీ మండల ప్రచార కార్యదర్శి శివరామిరెడ్డి ఆధ్వ ర్యంలో నిర్వహించారు. శివరామిరెడ్డి మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాలు, మహిళలు, రైతులు వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించారన్నారు. నాయ కులు పీసీ చెన్నారెడ్డి, వి.రామచంద్రారెడ్డి, తోట శివారెడ్డి, వైసి కళ్యాణ్‌రెడ్డి, వి.నారాయణరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, కేశవరెడ్డి, టైలర్ వెంకటరాముడు, మండ గోపాల్, దుర్గార్జున్, వెంకటరామిరెడ్డి, ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.
అవుకు: అవుకులోని టీడీపీ కార్యాలయంలో దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. అవుకు మండల నాయకులు దంతెల రమణ, వెంకటరాముడునాయక్, తిక్కన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి తెలుగుజాతి ఖ్యాతిని నలుమూలల చాటారన్నారు. నాయకులు జగన్, ఓబులేసు, ఈశ్వరయ్య, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
కోవెలకుంట్ల: పేదల గుండె చప్పుడు ఎన్టీఆర్ అని తెలుగుయువత నియోజవకర్గఅధ్యక్షుడు రుచిహోటల్ మద్దిలేటి, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం నాగేశ్వరరెడ్డి, టీడీపీ మండల అఽధ్యక్షుడు అమడాల మద్దిలేటి అన్నారు. గురువారం కోవెలకుంట్లప ట్టణంలోని టీడీపీ కార్యాలయంలో దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 11:35 PM