ఎన్టీఆర్‌కు ఘన నివాళి
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:57 PM
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కర్నూలు నగరంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు ఘనంగా నివా ళి అర్పించారు.
కర్నూలు(అర్బన్), జనవరి 18: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కర్నూలు నగరంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు ఘనంగా నివా ళి అర్పించారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, నియో జకవర్గ ఇన్‌చార్జి టీజీ భరత్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పరమేష్, మన్సుర్ ఆలీఖాన్, పద్మాలతారెడ్డి, టీడీపీ నాయకులు నాగరాజు యాదవ్, లక్కీటూ గోపి, పోతురాజు రవీ, సోమిశేట్టి నవీన్, గున్నా మార్కు, ముంతాజ్, విజయలక్ష్మి, జనసేన నేత పవన్, సురేష్ పాల్గొన్నారు.
కల్లూరు: పేదల ఆశాజ్యోతి దివంగత నందమూరి తారకరామారావు అని పాణ్యం, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జిలు గౌరు చరిత, గౌరు వెంకట రెడ్డి అన్నారు. గురువారం ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా కల్లూరు కుర్వగేరిలోని ఎన్టీఆర్ విగ్రహానికి గౌరు దంపతులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గౌరు దంపతులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ పాటు పడ్డారని అన్నారు. కార్య క్రమంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, టీడీపీ అర్బన్, రూరల్ అధ్యక్షులు పెరుగు పురుషోత్తంరెడ్డి, డి.రామాంజనే యులు, ఎన్వీ.రామకృష్ణ, ఎస్.ఫిరోజ్, పవన్ కుమార్, ప్రభాకర్‌యాదవ్, బి.నాగిరెడ్డి, కె.మహేష్‌గౌడ్, గంగాధర్‌గౌడ్, పీయూ మాదన్న, బీచుపల్లి, ఎస్.లక్ష్మీరెడ్డి, ఎ.వెంకటస్వామి పాల్గొన్నారు.
కర్నూలు(కల్చరల్): రంగస్థల నటులకు మార్గదర్శకులుగా దివంగత ఎన్టీ రామారావు నిలిచిపోతారని పలువురు రంగస్థల నటులు కొనియా డారు. గురువారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కళాకారులు ఎన్టీయార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పత్తి ఓబులయ్య మాట్లాడుతూ సీనీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న మహోన్నతవ్యక్తి ఎన్టీయార్ అని కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్టీయార్ నటించిన చిత్రాలపై వక్తలు ప్రసంగించారు. కళాకారులు బాలవెంకటేశ్వర్లు, గురుమూర్తి, లక్ష్మీకాంతరావు, కృష్ణ, యాగంటీశ్వరప్ప, క్రిష్టఫర్, ఆంజనేయులు, రాముడు పాల్గొన్నారు.
ఓర్వకల్లు: పేదల ఆశాజ్యోతి దివం గత నందమూరి తారక రామారావు అని టీడీపీ మండల అధ్యక్షుడు గోవిం దరెడ్డి అన్నారు. గురువారం ఓర్వక ల్లులో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ బడుగు బలహీనవర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి జీవితాల్లో వెలుగు నింపార న్నారు. మండలంలోని హుశేనాపురం, నన్నూరు, లొద్దిపల్లె, ఉయ్యాలవాడ, చెన్నం చెట్టిపల్లె, కన్నమడకల, శకునాల తదితర గ్రామాల్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అ ర్పించారు. టీడీపీ నాయకులు లక్ష్మీ కాంతరెడ్డి, అన్వర్, మెడికల్ షాప్ శేఖర్, అబ్దుల్లా, మధు, బజారు, సుధాకర్, రామగోవిందు, అల్లాబాబు పాల్గొన్నారు.
కోడుమూరు: స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని గురు వారం ఘనంగా నిర్వహించారు. సర్పంచు భాగ్యరత్న ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ సర్పంచు కేఈ రాంబాబు, పట్టణ అధ్యక్షుడు ఎల్లప్ప నాయుడు, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, తిరుమల నాయుడు, పరమేష్‌నాయుడు, బాషా, బడెషాగౌడ్, మధు, విజయ్, లక్ష్మయ్యశెట్టి, గోపాల్‌నాయుడు పాల్గొన్నారు.
గూడూరు: రానున్న ఎన్నికల్లో కోడుమూరు కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ నాయకుడు, నగర పంచాయతీ మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు అన్నారు. గురువారం గూడూరులో విష్ణు సేన ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు బోజుగు దానమన్న, కౌన్సిలర్లు బుడ్డంగలి, కోడుమూరు షాషావలి, సృజ న్, పౌలు, విజయ్ కుమార్, చాంద్ బాషా, గౌండ కుమార్ పాల్గొన్నారు.
సి.బెళగల్: మండల కేంద్రమైన సి.బెళగల్‌లో ఎన్టీఆర్ వర్ధంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్కులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహా నికి టీడీపీ నాయకుడు, మాజీ మండల కన్వీనర్ డాక్టర్ తిమ్మప్ప, మండల కన్వీనర్ గోవిందుగౌడు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసంద ర్భంగా టీడీపీ నాయకులు పసుపుల సర్పంచ్ బొగ్గుల దస్తగిరి మాట్లా డుతూ పేదల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎం పీటీసీ ధనుంజయుడు, గవూస్, వెంకటప్ప పాల్గొన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 11:57 PM