ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ కూటమి గెలిస్తేనే భవిష్యత్తు

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:47 AM

రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని పాణ్యం టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.

సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిస్తున్న గౌరు చరిత

20, 21వ వార్డు శంఖారావంలో గౌరు చరిత

కల్లూరు, మార్చి 27: రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని పాణ్యం టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. బుధవారం 20వ వార్డు సిండికేట్‌ బ్యాంక్‌కాలనీ, 21వ వార్డు పరిధిలోని శివాజీ నగర్‌, మాధవన గర్‌లో ఆమె ప్రజల సమస్యలను తెలుసుకుని శంఖారావం, సూపర్‌సిక్స్‌ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరు దంప తులు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబుతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి టీడీపీని గెలిపించాలని గౌరు దంపతులు పిలుపునిచ్చారు. కర్నూలు మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మ న్‌ పెరుగు పురుషోత్తంరెడ్డి, వార్డు ఇన్‌చార్జి ప్రభాకర్‌యాదవ్‌, బ్రాహ్మ ణపల్లె నాగిరెడ్డి, జనసేన నాయకుడు ప్రవీణ్‌, పల్లె రఘునాథ్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, మాండ్ర నరేంద్రారెడ్డి, వంగాల జనార్దన్‌రెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది నాగముని, రాయలసీమ విద్యార్థి విభాగం జేఏసీ చైర్మన్‌ శ్రీరాములు, అయ్యస్వామి, జగదీష్‌, జనసేన నాయకులు ప్రణీత్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఫ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: గౌరు జనార్దన్‌రెడ్డి

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరుచరిత తనయుడు గౌరు జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం 31వ వార్డు షరీన్‌నగర్‌లో ఇం టింటికీ తిరిగి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జి శైలజాయాదవ్‌, గోపి, లోకేష్‌, పురుషోత్తంరెడ్డి, ఎరుకలి వెంకటేశ్వర్లు, ఏసు, ఆదం పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:47 AM

Advertising
Advertising