విద్యారంగ సమస్యలపై పోరాటం
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:44 AM
విద్యా రంగ సమస్యలపై పోరాడాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్, టీయూసీఐ తిరుపాల్ పిలుపునిచ్చారు.
మాట్లాడుతున్న పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్
కర్నూలు ఎడ్యుకేషన, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): విద్యా రంగ సమస్యలపై పోరాడాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్, టీయూసీఐ తిరుపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక మాస్టర్ జూనియర్ కళాశాలలో విద్యార్థి అమరవీరుల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని గాలికి వదిలేసిందన్నారు. కొఠారి కమిషన ప్రకారం విద్యకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులను మంజూరు చేయడంలేదని, విద్యా ర్థుల పెండింగ్ ఫీజులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు రాజు, అభి, సుధీర్, వెంకటేష్ పాల్గొన్నారు.
Updated Date - Nov 13 , 2024 | 12:44 AM