విద్యతో పాటు క్రీడలు అవసరం
ABN, Publish Date - Oct 27 , 2024 | 12:48 AM
విద్యతో పాటు క్రీడలు అవసరమని ఆర్‌యూ వీసీ ఆచార్య ఎన్‌టీకే నాయక్ తెలిపారు. శనివారం సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఆర్‌యు అంతర్ కళాశాలల పురుషుల క్రీడా పోటీల ప్రారంభ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఆర్‌యూ వీసీ ఎన్‌టీకే నాయక్
కర్నూలు స్పోర్ట్స్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): విద్యతో పాటు క్రీడలు అవసరమని ఆర్‌యూ వీసీ ఆచార్య ఎన్‌టీకే నాయక్ తెలిపారు. శనివారం సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఆర్‌యు అంతర్ కళాశాలల పురుషుల క్రీడా పోటీల ప్రారంభ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాలీబాల్, సెపక్‌తక్రా, చెస్, బాస్కెట్‌బాల్ పోటీలను ప్రారంభించి క్రీడాకా రులను పరిచయం చేసుకున్నారు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి విజేతలు కావాలని కోరారు. కళాశాల డీన్ వై.శౌరీలు రెడ్డి, కోఆర్డినేటర్ డా.శివకిషోర్, రిజిస్ర్టార్ విజయకుమార్ నాయుడు, ప్రిన్సిపాల్ డా.కే.శాంత, పీడీలు చంద్రశేఖర్, మూర్తయ్య, డా.కళ్యాణ్ వెంకటేశ్ పాల్గొన్నారు. వాలీబాల్ విజేతగా సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలపై ఆర్‌యూ కళాశాల జట్టు 25-23, 25-10 పాయింట్లతో గెలిచింది. పత్తికొండ జట్టుపై ఎస్‌ఆర్‌కేడీసీ జట్టు 26-24, 25-16 పాయింట్లతో గెలిచింది.
Updated Date - Oct 27 , 2024 | 12:48 AM