ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్నికలకు సిద్ధం కావాలి

ABN, Publish Date - Jan 29 , 2024 | 12:30 AM

త్వరలో జరిగే ఎన్నికల యుద్ధానికి పార్టీ యంత్రాంగ మంతా సిద్ధం కావాలని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న సుబ్బారెడ్డి

డోన్‌ టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి

డోన్‌, జనవరి 28: త్వరలో జరిగే ఎన్నికల యుద్ధానికి పార్టీ యంత్రాంగ మంతా సిద్ధం కావాలని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టణ, మండల పార్టీ నాయ కులకు బూత్‌ ఇంటిగ్రేటెడ్‌ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలికేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఓటరు జాబితా వెరిఫికేషన్‌పై దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీడీపీ అదినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రతి ఇంట్లో అవగాహన కల్పించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. డోన్‌ నియోజకవర్గంలో టీడీపీ, జనసేనలకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అంతకముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి మిగిలింది ఇక 74 రోజులేనని, ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, మండల పార్టీ అధ్య క్షులు శ్రీనివాసులు యాదవ్‌, యువ నాయకులు ధర్మవరం గౌతమ్‌ రెడ్డి, అభి రెడ్డిపల్లె గోవిందు, జయన్న యాదవ్‌, మిద్దెపల్లి గోవిందు, ఎల్‌ఐసీ శ్రీరాములు, రామిరెడ్డి, కమలాపురం రమేష్‌, సిటీ కేబుల్‌ కిరణ్‌, ఆలిబాబా, నీలం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 12:30 AM

Advertising
Advertising