ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

ABN, Publish Date - Mar 17 , 2024 | 12:20 AM

నంద్యాలలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

నంద్యాలలో పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నివాళి

నంద్యాల (కల్చరల్‌), మార్చి 16: నంద్యాలలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంజీవనగర్‌ కూడలిలో వున్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భవనాశి నాగమహేష్‌, నంద్యాల ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు భవనాశి శ్రీనివాస, జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రదాన కార్యదర్శి బింగుమళ్ల శ్యామ్‌ సుందర్‌ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర పొలిటికల్‌ వైస్‌ చైర్మన్‌ కండె శ్యామ్‌సుందర్‌లాల్‌, ఆర్యవైశ్య సంఘం నాయకులు బైసాని రామశేషు, కొత్తసుబ్బయ్య, బీజేపీ చంద్రశేఖర్‌, డాక్టర్‌ గెలివి సహదేవుడు, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల (కల్చరల్‌/రూరల్‌): నంద్యాల పింగళిసూరన స్మారక శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ ఇన్‌చార్జి శ్రీధర్‌ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను పురష్కరించుకొని పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నందనం క్లబ్‌ సభ్యులు బి. నాగేంద్ర, కె. వేణుగోపాల్‌, పాఠకులు, తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల క్రైం: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శనివారం అవోపా అధ్యక్షుడు వీజీకే మూర్తి ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆస్పత్రిలోని 200మంది రోగులు, వారి సహాయకులకు అన్నదానం చేశారు. లయన్‌ పెలస శ్రీకాంత్‌, అవోపా జిల్లా అధ్యక్షుడు ఆత్మకూరు సుబ్రహ్మణ్యం, కార్యదర్శి రామకృష్ణ, ఉమామహేశ్వర్‌, మధుసూదన్‌, సాగర్‌, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మంటపంలో శనివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆ సంఘం నాయకులు పువ్వాడి భాస్కర్‌, శేగు కిరణ్‌కుమార్‌, జక్కా మురళీ, ఈపూరి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగూ ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో పొట్టిశ్రీరాములు చిత్రపటానికి మున్సిపల్‌ కమిషనర్‌ హరిప్రసాద్‌, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

మహానంది: మహానంది సమీపంలోని దేవస్థానం సిబ్బంది కాలనీలో ఒక పంక్షన్‌ హాలులో జిల్లా ఆర్య వైశ్య ప్రముఖలు పొట్టి శ్రీరాములు జయంతిని నిర్రవహించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు భవనాశి వెంకట రమణయ్య, జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు భవనాశి మంజులవాణి తదితరులు పాల్గొన్నారు.

వెలుగోడు: వెలుగోడు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆర్యవైశ్య నాయకులు బళ్ళాని వెంకట సత్యనారాయణ, బచ్చు రాము, నాగేళ్ళ సుబ్రమణ్యం, సింహాద్రి ప్రసాద్‌ గుప్తా, మెడికల్‌ రాము, సురేశ్‌, సంపత్‌, రవికుమార్‌ పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

నందికొట్కూరు: పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను నందికొట్కూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మున్సిపల్‌ కమీషనర్‌ సుధాకర్‌రెడ్డి, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య, పట్టణ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకులు సురేంద్రనాథ్‌రెడ్డి, ముర్తుజావళి, షకీల్‌ అహ్మద్‌, జాకీర్‌, నిమ్మకాల రాజు, రాజన్న, జమీల్‌, కళాకర్‌, సౌదీ చాంద్‌, నిమ్మకాయల మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌ సుధాకర్‌రెడ్డి, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్‌లు క్షీరాషేకం చేసి, పూలమాల వేసి నివాళి అర్పించారు.

Updated Date - Mar 17 , 2024 | 12:20 AM

Advertising
Advertising