ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎంపీటీసీకి ఎంపీ సీటు..!

ABN, Publish Date - Mar 23 , 2024 | 12:26 AM

సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు గెలుపు గుర్రాలను ఎంపిక చేశారు.

కర్నూలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు

గత స్థానిక సంస్థల్లో రాజకీయ అరంగ్రేటం

తృటిలో చేజారిన ఎంపీపీ పదవి

బీసీలకే టికెట్‌... మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

కర్నూలు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు గెలుపు గుర్రాలను ఎంపిక చేశారు. ఇప్పటికే జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను రెండు విడతల్లో ప్రకటించారు. శుక్రవారం రాష్ట్రంలో 13 పార్లమెంట్‌ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. రాజకీయ, సామాజిక సమీకరణలు, సర్వే ఆధారంగా కర్నూలు పార్లమెంట్‌ స్థానం టీడీపీ అభ్యర్థిగా కర్నూలు రూరల్‌ మండలం పంచలింగాల గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సాధికారిత రాష్ట్ర సమితి సభ్యుడు, ఎంపీటీసీ సభ్యుడు బస్తిపాడు నాగరాజు అలియాస్‌ పంచలింగాల నాగరాజు పేరును అధికారికంగా ప్రకటించారు. రెండున్నర ఏళ్ల క్రితమే ఈ ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్‌ బీసీ సామాజికవర్గంలో కురవ సామాజిక వర్గానికి ఇస్తున్నట్లు అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ఆ ప్రకారమే నాగరాజును ఎంపిక చేస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

జిల్లాలోని బీసీలలో రాజకీయంగా వెనుకబడిన కురవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి పంచలింగాల నాగరాజు. ఎంఎస్సీ బీఈడీ చేసిన విద్యావంతుడు. ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల కళాశాలలో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా మూడేళ్లు పని చేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా టీజీవీ గ్రూప్స్‌కు చెందిన రాయలసీమ అల్కాలిస్‌ సంస్థలో కూడా ఏడాది పాటు పని చేశారు. ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిన ఆయన రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అడుగులు వేశారు. టీడీపీలో చేసి సామాన్య కార్యకర్తగా సేవల అందించారు. ఆ తర్వాత టీడీపీ బీసీ సాధికారిత రాష్ట్ర సమితి సభ్యుడిగా పార్టీ ఎంపిక చేసింది. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు మండల పరిషత్తు అఽధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. పంచలింగాల-1 ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో అధికార వైసీపీ నాయకులు, పోలీసుల బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకొని తనతోపాటు 11 మంది ఎంపీటీసీ సభ్యుల్ని గెలిపించుకున్నారు. మండలాధ్యక్షపీఠం దక్కాలంటే 12 ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉండాలి. కానీ స్వతంత్ర ఎంపీటీసీ సభ్యుడు వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఎంపీపీ పదవి తృటిలో చేజారింది.

టికెట్‌ రేసులో తొమ్మిది మంది

కర్నూలు ఎంపీ టీడీపీ అభ్యర్థిగా బీసీలలో కురువ సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడిని అన్వేషిస్తుందని తెలియగానే అదే సామాజికవర్గానికి చెందిన కర్నూలు రూరల్‌ మండలం పంచలింగాలకు చెందిన బస్తిపాడు నాగరాజు (బస్తిపాడు నాగరాజు), జిల్లాకు చెందిన హరియాణా గవర్నర్‌ ఓఎస్‌డీ, ఐటీ నిపుణుడు కురువ భానుశంకర్‌, ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బత్తిన లక్ష్మీనారాయణ, కర్నూలు నగరంలో ప్రముఖ ప్రైవేటు వైద్యశాల అమిలీయో ఆస్పత్రి అధినేత డాక్టర్‌ ప్రసాద్‌, సత్యం వెంచర్స్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ సీనియర్‌ ప్రాజెక్ట్‌ మేనేజరు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు ఎంకే రాజశేఖర్‌, డిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పత్తికొండ వాసి పరమేశ్‌తో పాటుగా కర్నూలుకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు లక్కీ టు సోదరుల్లో ఒకరు రాంపుల్లయ్య యాదవ్‌, టీడీపీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్‌, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ అధిష్టానానికి బయోడేటాలు పంపారు. సర్వేలు, రాజకీయ సమీకరణాలు ఆధారంగా చివరికి పంచలింగాల నాగరాజును చంద్రబాబు ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

టీడీపీ సీనియర్‌ నేతలను కలసిన నాగరాజు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు టికెట్‌ కేటాయించగానే ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, కోడుమూరు టీడీపీ మాజీ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌రెడ్డి, కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌, కోడుమూరు (ఎస్సీ) టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరిలను కలసి తనను ఆశీర్వదించి మద్దతు ఇవ్వాలని కర్నూలు ఎంపీ టీడీపీ అభ్యర్థి నాగరాజు కోరారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

నాగరాజు బయోడేటా

పేరు : బస్తిపాడు నాగరాజు (పంచలింగాల నాగరాజు)

విద్యార్హత : ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఈడీ

జననం : 1979 జూన్‌ 1

స్వగ్రామం : పంచలింగాల గ్రామం

ప్రస్తుత వృత్తి : రియల్‌ ఎస్టేట్‌, బిల్డర్‌

కుటుంబ నేపథ్యం : తల్లిదండ్రులు బస్తిపాడు మహానందమ్మ (లేట్‌), నాగభూషణం. భార్య: జయసుధ (గృహిణి), కుమారుడు కార్తిక్‌, కూతురు రిషిత

ఎంపీగా విజయం సాధిస్తా

నాపై ఎంతో విశ్వాసంతో కర్నూలు పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీ టీడీపీ అభ్యర్థిగా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. 1983లో టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ పత్తికొండ ఎమ్మెల్యే టికెట్‌ కురవలకు ఇచ్చారు. నాడు గెలిచి కానుకగా ఇచ్చాం. 40 ఏళ్ల తరువాత అధినేత చంద్రబాబు కురవను చట్ట సభలకు పంపాలనే లక్ష్యంతో నాకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. జిల్లాలో పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా అన్ని వర్గాలను నాయకులు, కార్యకర్తల సహకారంతో విజయం సాధించి అధినేతకు కానుకగా ఇస్తాం.

- బస్తిపాడు నాగరాజు, ఎంపీ అభ్యర్థి

Updated Date - Mar 23 , 2024 | 12:27 AM

Advertising
Advertising