ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు: ఎస్పీ

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:41 AM

జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు.

చాగలమర్రి, మార్చి 27: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. చాగలమర్రి టోల్‌ప్లాజా సమీపం లో జిల్లా సరిహద్దు చెక్‌పోస్టును బుధవారం ఆయన తనిఖీ చేశారు. కడప జిల్లా నుంచి నంద్యాల జిల్లా వైపు వస్తున్న వాహనాలను నిలిపి పోలీసులు తనిఖీ చేయడాన్ని పరిశీలించారు. పోలీసు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో అక్రమ మద్యం, నగదు, గంజాయి తదితర రవాణా కాకుండా చెక్‌ పోస్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులను 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. జిల్లాలో ప్రతి రోజు విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా వాహనాలు తనిఖీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణా అడ్డుకునేం దుకు పోలీసు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఏదైన అనుమానం వస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ సంతోష్‌, ఆళ్లగడ్డ ట్రైనీ డీఎస్పీ రఘువీర్‌, రూరల్‌ సీఐ హనుమంతనాయక్‌, ఎస్‌ఐ రమణయ్య, పోలీసులు ఉన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:41 AM

Advertising
Advertising