సభ్యత్వం తీసుకుంటే రూ.5లక్షల బీమా
ABN, Publish Date - Oct 27 , 2024 | 01:13 AM
రూ.వంద చెల్లించి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే రూ.5లక్షల బీమా వర్తిస్తుం దని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి అన్నారు.
ఆదోని, అక్టోబరు 26, (ఆంధ్రజ్యోతి) : రూ.వంద చెల్లించి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే రూ.5లక్షల బీమా వర్తిస్తుం దని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి అన్నారు. శనివారం మండల లోని బసాపురం గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారం భించారు. నిరుపేద కార్యకర్తల పిల్లల చదువుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సాయం అందుతుందన్నారు.
పత్తికొండ: పార్టీ సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా లభిస్తుందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి అన్నారు. శనివారం పత్తికొండలో మైనార్టీ నాయకుడు మీరాహుసేన్ ఆద్వర్యంలో పార్టీసభ్యత్వ నమోదును ప్రారంభించారు. లీగల్ సెల్ సభ్యుడు సురేష్‌కుమార్, బీసీసెల్ నాయ కుడు రామానాయుడు, తెలుగుయువత నాయకుడు బత్తినలోక్‌నాధ్, కన్వీనర్ కడవల సుధాకర్, సింగం శ్రీనివాసులు, ఉచ్చీరప్ప ఉన్నారు.
వెల్దుర్తి: మండలంలో బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో పార్టీ నాయకుడు సుబ్బరా యుడు శనివారం టీడీపీ సభ్యత్వ నమో దును ప్రారంభించారు. అలాగే వెల్దుర్తిలో మండల అధ్యక్షుడు బలరాం గౌడ్, రమా కాంత రెడ్డి, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌గౌడ్, గుంటుపల్లె గ్రామంలో ఈదుల వెంకటరాముడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.
తుగ్గలి: సభ్యత్వ నమోదుతో కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మనోహర్ చౌదరి, మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, సర్పంచ్ చౌడప్ప అన్నారు. శనివారం టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. శ్రీనివాసులు గౌడ్, ప్రతాప్ యాదవ్, మహేష్‌గౌడు, రంగారెడ్డి, మసాల శ్రీనివాసులు, నల్లగుండ్ల రవి, రామాంజనేయులు, ఈరమ్మ, శ్రీనివాస్, మునీశ్వర్‌గౌడు, రామాంజనే యులు, రామారావు, చాంద్‌బాషా తదితరులు ఉన్నారు.
మద్దికెర: పార్టీ సభ్యత్వంతో కార్యకర్త కుటుంబానికి భరోసా లభిస్తుందని జిల్లా టీడీపీ కార్యదర్శి గూడూరు ధనుంజ యుడు, పత్తికొండ మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ శ్రీనివాసులు, సంజప్ప అన్నారు. శనివారం మండలంలోని మదనంతపురం గ్రామంలో టీడీపీ సభ్యత్వనమోదు కార్యక్ర మానికి శ్రీకారం చుట్టారు. హరినాథ్‌గౌడ్, తిమ్మప్ప, గడ్డం మల్లికార్జున, శాంతిరెడ్డి, సుగ్గులప్ప తదితరులు ఉన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 01:13 AM