ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యాన పంటలకు మంచి రోజులు

ABN, Publish Date - Oct 03 , 2024 | 01:25 AM

పండ్ల తోటల సాగు చేసేందుకు రైతులు ఇష్టం చూపడంలేదు. కారణం.. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం పండ్ల తోటల సబ్సిడీకి ఇవ్వకుండా ఎగనామం పెట్టింది. అందుకే రైతులు పండ్ల తోటల సాగు అంటేనూ నిరుత్సాహంగా ఉన్నారు.

రుద్రవరంలో సాగు చేసిన అరటి తోట

.ప్రభుత్వం ప్రకటనతో రైతుల్లో ఉత్సాహం

గత వైసీపీ పాలనలో పైసా సబ్సిడీ అందని వైనం

రుద్రవరం, అక్టోబరు 2: పండ్ల తోటల సాగు చేసేందుకు రైతులు ఇష్టం చూపడంలేదు. కారణం.. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం పండ్ల తోటల సబ్సిడీకి ఇవ్వకుండా ఎగనామం పెట్టింది. అందుకే రైతులు పండ్ల తోటల సాగు అంటేనూ నిరుత్సాహంగా ఉన్నారు. గత ఐదేళ్లలో ఉద్యాన పంటల సబ్సిడీ పైసా కూడా రైతులకు వైసీపీ ప్రభుత్వం మంజూరు చేయలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు అందుబాటులోకి ఉద్యాన పంటల సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. రైతులు ఉద్యానపంటలు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రైతులకు ఉపయోగపడే చిన్నట్రాక్టర్లు, పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లు తైవాన్‌ స్ర్పేయర్లు వంటి వాటికి ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేస్తోంది. జిల్లాలో అరటి, జామ, మామిడి దానిమ్మ, సీతాఫలం, అల్లనేరేడు, పూలసాగు కూరగాయలు ఇలా పండ్లతోటల సాగుకు నంద్యాలజిల్లా పెట్టింది పేరు. అయినా సబ్సిడీ అందకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంపై పండ్లతోటలు సాగు చేసే రైతులు ఎన్నో ఆశలు పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తాం

జిల్లాలో పండ్ల తోటల సాగు అభివృద్ధిపై రైతులకు అవగాహన కల్పిస్తాం. గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి పండ్లతోటల సాగు అభివృద్ధి చెందేందుకు రైతుల్లో చైతన్యం తీసుకువస్తాం. ప్రభుత్వం పండ్లతోటలకు సబ్సిడీ అందిస్తుంది.

- నాగరాజు, ఉద్యానశాఖ జిల్లా అధికారి

గత ఐదేళ్లలో పైసా కూడా అందలేదు

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో పైసా కూడా పండ్లతోటలకు సబ్సిడీ అందలేదు. ఈ సారి నాలుగు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశా. సబ్సిడీ ఈప్రభుత్వం అందిస్తుందన్న ఆశ ఉంది. సబ్సిడీ వస్తే రైతులకు కాస్త ఉపశమనంగా ఉంటుంది. - వాసు, రైతు, ఆలమూరు

మూడెకరాల్లో బొప్పాయి సాగు చేశా

మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశా. గత ఐదేళ్లలో పండ్లతోటలు సాగు చేసి నష్టపోయా. పైసా సబ్సిడీ అందలేదు. ఈ సారి ఈ ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్న ఆశ ఉంది. - పీరా, రైతు, ఆలమూరు

Updated Date - Oct 03 , 2024 | 01:25 AM