ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భూముల కోసం రైతుల నిరసన

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:57 PM

మండలంలోని పాతపాడు, మీరాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఏడాదికి మూడు పంటలు పండే పొలాల్లో హైడ్రో ప్రాజెక్టు ఏర్పాటు వద్దని సీపీఐ నాయకులు అన్నారు.

పాతపాడులో నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు

బనగానపల్లె, జనవరి 18: మండలంలోని పాతపాడు, మీరాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఏడాదికి మూడు పంటలు పండే పొలాల్లో హైడ్రో ప్రాజెక్టు ఏర్పాటు వద్దని సీపీఐ నాయకులు అన్నారు. పాతపాడులో వారు హైడ్రో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సీపీఐ కార్యదర్శి సోమన్న మాట్లాడుతూ హైడో ప్రాజెక్టు పేరుతో రైతుల అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు ప్రారంభించడం దారుణమన్నారు. ఇప్పటికే సిమెంట్‌ ఫ్యాక్టరీల పేరుతో మైనింగ్‌ కోససమని రైతుల భూములు, ప్రభుత్వ భూములను గద్దల్లా తన్నుకుపోయారన్నారు. మైనింగ్‌ లేక ప్రస్తుతం రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండగా మరో 700 ఎకరాలు ప్రాజెక్టు కోసమంటూ భూమిని సేకరిస్తోందని అన్నారు. భూములు లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతు సంఘం నాయకులు సుబ్బారెడ్డి, శివనాగయ్య, పతేనగర్‌ శివయక, సంజీవులు, పాతపాడు రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:57 PM

Advertising
Advertising