ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీసు ఆయుధాల ప్రదర్శన

ABN, Publish Date - Oct 27 , 2024 | 12:14 AM

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసు ఆయుధాల ప్రదర్శన (ఓపెన్‌ హౌస్‌) కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జి. బిందుమాధవ్‌ ప్రారంభించారు.

ప్రారంభిస్తున్న ఎస్పీ

కర్నూలు క్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసు ఆయుధాల ప్రదర్శన (ఓపెన్‌ హౌస్‌) కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జి. బిందుమాధవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో పలు విద్యాసంస్థల విద్యార్థులతో ఎస్పీ ముచ్చటిస్తూ పోలీసు విధుల్లో వినియోగించే ఆయుధాల పట్ల విద్యార్థులకు అవగాహన ఉండాలని అన్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రెండు రోజుల పాటు ఆయుధాల ప్రదర్శన ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంట వరకు ఓపెన్‌ హౌస్‌ ఎగ్జిబిషన్‌ ఉంటుందన్నారు. ఏ సందర్భంలో ఏ ఆయుధాన్ని వినియోగించేదీ విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు సోమశేఖర్‌ నాయక్‌, నారాయణ, జావేద్‌, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, నగరంలోని పలు విద్యాసంస్థలకు సంబందించిన విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 12:14 AM