ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహానందిలో పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Nov 25 , 2024 | 12:06 AM

కార్తీక మాసంతోపాటు ఆదివారం కావడంతో మహానంది క్షేత్రం వేలాది మంది భక్తులతో పోటెత్తింది.

మహానందిలో దర్శనం కోసం క్యూలో నిల్చున్న భక్తులు

మహానంది, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసంతోపాటు ఆదివారం కావడంతో మహానంది క్షేత్రం వేలాది మంది భక్తులతో పోటెత్తింది. తెల్లవారు జామునే ఆలయం ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరుతోపాటు రెండో ప్రాకారంలోని కోనేర్లలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం మహిళలు ఉసిరి చెట్టు వద్ద, ఆలయం ముందు భాగంలో కార్తీక దీపాలు వెలిగించారు. పరమశివుని దర్శనం కోసం రెండు గంటల పాటు క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎర్రమల్ల మధులు దర్శనం వేళల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్యయంగా పర్యవేక్షించారు. కార్తీక మాసం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో నంద్యాల జిల్లా న్యాయాధికారి కె.వాసు దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. వీరికి ఆలయ పర్యవేక్షకుడు శశిధర్‌రెడ్డి స్వాగతం పలికారు. పూజల అనంతరం శాల్వతో సన్మానించి, ప్రసాదాలు అందజేశారు.

Updated Date - Nov 25 , 2024 | 12:06 AM