మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Oct 06 , 2024 | 12:45 AM
శ్రీమఠానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావటంతో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.
మంత్రాలయం, అక్టోబరు 5: శ్రీమఠానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావటంతో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిర్సింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ వెంక టేష్ జోషి పరిమళ ప్రసాదం కొరత రానీయకండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. రథోత్సవం ఊరేగింపులో పాల్గొని భక్తులు పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీ పెరగడంతో లాడ్జీలు, హోటళ్లు, పూజా సామగ్రికి డిమాండ్ పెరిగింది. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు ప్రధాన రహదారిపైనే వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
గజ వాహనంపై ప్రహ్లాదరాయలు
మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. నవరాత్రుల్లో శనివారం తదియను పురస్కరించుకుని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు పూజలు నిర్వహించారు.
రాఘవేంద్రుడి సన్నిధిలో ప్రముఖులు
తెలంగాణ రాష్ట్ర బీసీ సెల్ కమిషనర్ నిరంజన్, కర్ణాటక రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మంత్రి మునియప్ప, మంత్రి శివరాజ్ తంగడిగి శనివారం వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. తహసీల్దారు రవి, అనంతపు రాణిక్, జేపీ స్వామి, ఏఎస్‌ఐ పెద్దయ్య, బిందుమాధవ్, వ్యాస రాజార్, ప్రకాష్ ఆచార్, బసప్ప, రంగస్వామి, వీఆర్‌వో భీముడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 06 , 2024 | 12:45 AM