ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆలస్యమవుతున్న ఎంఆర్‌ఐ రిపోర్టులు

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:33 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎంఆర్‌ఐ ఆన్‌లైన్‌ రిపోర్టులు తరచూ ఆలస్యమవుతున్నాయని, దీంతో రోగుల చికిత్స, ఆరోగ్యశ్రీ రిజిస్ర్టేషన్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ హెచ్‌ఓడీలు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకటరంగారెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు.

సూపరింటెండెంట్‌కు హెచ్‌ఓడీల ఫిర్యాదు

ఇక నుంచి రెగ్యులర్‌గా ‘సూపర్‌ స్పెషాలిటీ’ ఓపీలు

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 17: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎంఆర్‌ఐ ఆన్‌లైన్‌ రిపోర్టులు తరచూ ఆలస్యమవుతున్నాయని, దీంతో రోగుల చికిత్స, ఆరోగ్యశ్రీ రిజిస్ర్టేషన్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ హెచ్‌ఓడీలు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకటరంగారెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరీ హాలులో ఆరోగ్యశ్రీ, ఈ-హాస్పిటల్‌పై హెచ్‌ఓడీలతో సూపరింటెండెంట్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆన్‌లైన్‌లో ఎంఆర్‌ఐ రిపోర్టులు, రోజులతరబడి రావడం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని కొందరు హెచ్‌ఓడీలు సూపరింటెండెంట్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన రేడీయాలజి హెచ్‌ఓడీని వివరణ కోరారు. ఎంఆర్‌ఐ రిపోర్టుల కోసం రోగులు ఇబ్బందులు పడకుండా పరీక్షలు చేసిన ఆరు గంటల్లోపు రిపోర్టులు ఇవ్వాలని ఎంఆర్‌ఐ నిర్వాహకులను ఆదేశించారు. రేడియాలజి అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను కొందరిని నియమించి ఎంఆర్‌ఐ రిపోర్డులు ఏరోజుకారోజు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని రేడీయాలజి హెచ్‌ఓడీని ఆదేశించారు. సూపర్‌ స్పెషాలిటీ ఓపీలను ప్రతిరోజు రెగ్యులర్‌గా నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో ఈ హాస్పిటల్‌ టార్గెట్లలో టాప్‌ ఫర్ఫార్మెన్స్‌ కనబరిచిన పీడీయాట్రిక్‌, సైక్రియాట్రిక్‌ డిపార్టుమెంట్లను సూపరింటెండెంట్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సుధాకర్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చింతా ప్రభాకర్‌ రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ హరిచరణ్‌, సీఎ్‌సఆర్‌ఎంవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఎ్‌సఆర్‌ఎంవో హేమనళిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:33 AM

Advertising
Advertising