సీపీఎస్‌ను రద్దు చేయాలి: ఎస్టీయూ
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:25 AM
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.గోకారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), జనవరి 28: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.గోకారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సలాంఖాన్ ఎస్టీయూ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక బకాయిలు చెల్లించకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతా మని హెచ్చరించారు. 30 శాతం మధ్యంతర భృతిని వెంటనే మంజూరు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, కార్మికులకు సంబంధించిన పెండింగ్ రుణాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ సీపీఎస్‌ను రద్దు చేయకపోగా.. దాని స్థానంలో జీపీఎస్‌ను తీసుకురావడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నార న్నారు. ప్రాథమిక విద్య వ్యవస్థను నిర్వీర్యం చేసి జీవో.117ను రద్దు చేయా లన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు శ్రీధర్, గోవిందు, శేఖర్, మహ మ్మద్ షఫీ, సుధాకర్‌గౌడు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 12:25 AM