ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదవర్గాలకు సహకారం అందించాలి

ABN, Publish Date - Nov 25 , 2024 | 12:10 AM

పేద వర్గాలకు వైద్య, విద్య, ఉపాధి రంగాల్లో సహకారం అందించడానికి కమ్మ సంఘం నాయకులు కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు.

కమ్మసంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనం

కర్నూలు కల్చరల్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పేద వర్గాలకు వైద్య, విద్య, ఉపాధి రంగాల్లో సహకారం అందించడానికి కమ్మ సంఘం నాయకులు కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలు నగరంలోని కాకతీయనగర్‌ కమ్మ సంఘం ప్రాంగణంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ పేద వర్గాలకు జిల్లా కమ్మ సంఘం ద్వారా తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ కమ్మ కులస్థులు తమతో పాటు ఇతర కులాల వారిని కూడా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించిన సమయంలోనూ బడుగు, బలహీన వర్గాల వారిని ప్రోత్సహించి రాజకీయంగా వారికి ఎన్నో అవకాశాలు కల్పించారన్నారు. ప్రతి ఒక్కరూ ఆ మహనీయుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కమ్మ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ అందరూ సమైక్యంగా ఉంటేనే సంఘం బలపడుతుందన్నారు. పారిశ్రామికవేత్త యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా కుల సంఘాలు పనిచేయాలని సూచించారు. ఏపీ కమ్మ సేవా సమాఖ్య జనరల్‌ సెక్రటరీ బెజవాడ వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేదవారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలు అందించి వారి విద్యాభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమ్మ సంఘం కార్యదర్శి పెనికలపాటి రాజశేఖర్‌, ఏపీ కమ్మ సమాఖ్య వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మురుకొండ బోసుబాబు, కార్యదర్శులు వెలగ కోటేశ్వరరావు, తమ్మినేని రమేష్‌, మాంటిస్సోరి పాఠశాల డైరెక్టర్‌ కేఎన్‌వీ రాజశేఖర్‌, రిటైర్డ్‌ ఏఎస్పీ రామప్పగారి వెంకన్న చౌదరి, మాజీ అధ్యక్షుడు వడ్లమూడి చలమయ్య, మోదేపల్లి సుబ్బరాయుడు, కుసుపాటి రాజగోపాల్‌, మాజీ కార్పొరేటర్‌ జంపాల మధుసూదన్‌రావు, కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి, కల్యాణ మంటపం పర్యవేక్షకుడు కుసుపాటి బాబ్జి, అమిత్‌, యోగానంద హర్షవర్థన్‌, చంద్రశేఖర్‌, కేశవరామ్‌ చౌదరి, సోంపల్లి శేఖర్‌, నాగేశ్వరరావు, పి.హనుమంతరావు చౌదరి, ఉన్నం వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక నృత్యాలు, మ్యాజిక్‌ షో, ఆటల పోటీలు అలరించాయి.

Updated Date - Nov 25 , 2024 | 12:10 AM