ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆంజనేయ స్వామికి అభిషేకం

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:15 AM

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వెలసిన బీగాల ఆంజనేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అహోబిలంలో ఆంజనేయస్వామికి అభిషేకం చేస్తున్న అర్చకులు

ఆళ్లగడ్డ, జనవరి 11: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వెలసిన బీగాల ఆంజనేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రహ్లాద వరదులు, ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవిని బీగాల ఆంజనేయస్వామి వద్దకు అర్చకులు ఉదయాన్నే చేర్చారు. అక్కడ ప్రహ్లాద వరదులకు నవ కలశ స్నపన అభిషేకం, సాయంత్రం తిరువడి కోవెలలో హనుమజ్జయంతి విశేష ఆస్థానం, గోష్టి కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు.

కొనసాగుతున్న ధనుర్మాస పూజలు

అహోబిలంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం వేకువజామున్నే ఉత్సవమూర్తులైన ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో పాటు గోదాదేవి అమ్మవారికి తిరుప్పావై, సేవాకాలం, శాత్తుమురై, గోష్టి కార్యక్రమాలను నిర్వహించారు.

ు.

Updated Date - Jan 12 , 2024 | 12:15 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising