Year Ender 2024: వైసీపీ నేతల అరాచకానికి పరాకాష్ట.. ఏపీలోనే సెన్సేషనల్ కేసు ఇది..
ABN, Publish Date - Dec 17 , 2024 | 10:41 AM
బాలీవుడ్ నటి జెత్వానీ కేసు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం. ఓ పారిశ్రామికవేత్తపై జెత్వానీ పెట్టిన కేసును వెనక్కి తీసుకునేందుకు నటిపై విజయవాడ ఇబ్రహింపట్నంలో కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు హుటాహుటిన ముంబై వెళ్లి నటితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చి వేధింపులకు గురిచేశారు.
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎన్నో అరాచకాలు, ఎన్నో విధ్వంసాలు చూశాం. పలు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి ఎంతో మంది అమాయకులు బలయ్యారు కూడా. అలాగే కొంతమంది వైసీపీ నేతల వేధింపులకు గురయ్యారు. వారిలో ముంబై నటి కాదంబరి జెత్వానీ ఒకరు. వైసీపీ నేతల అరాచకానికి, వేధింపులకు గురయ్యారు ఈ నటి. అంతేకాకుండా పోలీసు ఉన్నతాధికారులు కూడా నటి పక్షాన కాకుండా పాలక పక్షం వైపే నిలబడ్డారు. దీంతో ఆమె ఆవేదనను వినేవారే లేకుండా పోయారు. చివరకు ప్రభుత్వం మారి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నటి జెత్వానీ విషయంలో గత ప్రభుత్వ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు చేసిన అకృత్యాలు ఒక్కొక్కొటిగా బయటకు వచ్చాయి. జెత్వానీకి న్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరించింది. ఈ కేసులో వైసీపీ నేతను అరెస్ట్ చేయడంతో పాటు.. ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే జెత్వానీ కేసులో ఎన్నో ములుపులు.. అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి.
యూట్యూబ్‌లో ఈ ఏడాది దుమ్ములేపిన వీడియోలివే..
ఏం జరిగిందంటే..
బాలీవుడ్ నటి జెత్వానీ కేసు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం. ఓ పారిశ్రామికవేత్తపై జెత్వానీ పెట్టిన కేసును వెనక్కి తీసుకునేందుకు నటిపై విజయవాడ ఇబ్రహింపట్నంలో కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు హుటాహుటిన ముంబై వెళ్లి నటితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చి వేధింపులకు గురిచేశారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులకు నటి జెత్వానీ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసుకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను కూడా పోలీసులకు జెత్వానీ అందజేసింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు.
అలాగే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ, సీపీ కాంతి రాణా టాటాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసు విషయంలో కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఈ ముగ్గురు పోలీసులు ఉన్నతాధికారులు కూడా నటి జెత్వానీ పట్ల చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించారని విచారణలో తేలింది. అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారించేలా, జగన్ ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తుతూ ప్రవర్తించారనే ప్రచారం కూడా జరిగింది.
దుకాణంలో కొనేదంతా బంగారం కాదు..
సీఐడీకి అప్పగిస్తూ...
ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ అనేక మార్లు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ ఆయనకు చుక్కెదురే అయ్యింది. అలాగే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. జెత్వానీ కేసును సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి ఈ కేసుపై సీఐడీ విచారణను ప్రారంభించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నటి జెత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను సీఐడీ అధికారులు విచారించి వివరాలు సేకరించారు. నటి జెత్వానీ ఈ కేసుకు సంబంధించి మొత్తం నాలుగు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మూడుసార్లు పోలీసు కమిషనర్‌కు, నాలుగోసారి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కాదంబరి వ్యవహారం వెలుగులోకి వచ్చాక విచారణకు కోసం ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌లోని ఏసీపీ స్రవంతిరాయ్‌కు ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించారు. ఆమె కాదంబరితో పాటు తండ్రి నరేంద్రకుమార్ జెత్వానీ, తల్లి ఆశా జెత్వానీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. 100 పేజీలతో విచారణ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ప్రస్తుతం వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. దాదాపు 76 రోజులుగా విద్యాసాగర్ జైలులోనే ఉన్నారు. కాగా.. ఇటీవలే విద్యాసాగర్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చివరగా నటి కాందబరి జెత్వానీ విషయంలో ఏ మేరకు న్యాయం జరుగుతోందో చూడాలి.
మరిన్ని Year Ender - 2024 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి...
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 17 , 2024 | 11:36 AM