ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా

ABN, Publish Date - Oct 28 , 2024 | 01:19 AM

ఈత సరదా ఇద్దరి నిండు ప్రాణాలు తీసిన ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతానికి చెందిన సి.హేమంత్‌కుమార్‌(17), గుడివాడ దుర్గాప్రసాద్‌(23) మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం కృష్ణానదిలో ఈతకు వెళ్లారు.

సీతానగరం వద్ద కృష్ణానదిలో ఘటన

శోకసంధ్రంలో రెండు కుటుంబాలు

అజిత్‌సింగ్‌నగర్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి) : ఈత సరదా ఇద్దరి నిండు ప్రాణాలు తీసిన ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతానికి చెందిన సి.హేమంత్‌కుమార్‌(17), గుడివాడ దుర్గాప్రసాద్‌(23) మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. సీతానగరం వైపు రైల్వే అండర్‌ పాస్‌ వద్ద ద్విచక్రవాహనాలను పెట్టి నదిలో దిగారు. రైల్వే బ్రిడ్జి దిగువన రెండవ పిల్లరు వద్దకు వెళ్లిన ఐదుగురు స్నేహితులు కొంత సేపు అక్కడ గడిపారు. అనంతరం హేమంత్‌కుమార్‌, విభిన్న ప్రతిభావంతుడైన దుర్గాప్రసాద్‌ మళ్లీ ఈతకు నదిలోకి దిగారు. మిగిలిని ముగ్గురు ఒడ్డున కూర్చున్నారు. అయితే వీరు దిగిన ప్రాంతంలో ఊబి ఉండటంతో ఒకరి తర్వాత మరొకరు మునిగిపోయారు. అక్కడే ఉన్న మత్స్యకారులు నీటిలో దిగి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. దుర్గాప్రసాద్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుండగా, హేమంత్‌కుమార్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బిడ్డల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Updated Date - Oct 28 , 2024 | 01:19 AM