ప్రాణాలు మింగినది
ABN, Publish Date - Jan 29 , 2024 | 01:14 AM
ఆ నలుగురు మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉంటారు. ఆదివారం సెలవు కావడంతో ఫొటోషూట్ చేసుకుందా మనుకున్నారు. ఎంతో ఆనందంగా ఇళ్ల నుంచి బయలుదేరారు. కృష్ణానది వైపు పరుగులు తీశారు. యనమలకుదురు సమీపంలో ఉన్న కృష్ణానది పాయలో మునిగి ప్రాణాలు కోల్పో యారు. వీరు విజయవాడ పటమటకు చెందినవారు. ఆ కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. వారితోపాటు వెళ్లిన మరో విద్యార్థి నదిలోకి దిగకపోవడంతో మృత్యుంజయుడు అయ్యాడు. అతను పెనమలూరు మండలం సనత్‌నగర్‌కు చెందినవాడు.
కృష్ణానదిలో మునిగి ముగ్గురి దుర్మరణం
మృతులు పటమటకు చెందిన విద్యార్థులు
ఫొటో షూట్‌కు వెళ్లి జలసమాధి
ఆ నలుగురు మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉంటారు. ఆదివారం సెలవు కావడంతో ఫొటోషూట్ చేసుకుందా మనుకున్నారు. ఎంతో ఆనందంగా ఇళ్ల నుంచి బయలుదేరారు. కృష్ణానది వైపు పరుగులు తీశారు. యనమలకుదురు సమీపంలో ఉన్న కృష్ణానది పాయలో మునిగి ప్రాణాలు కోల్పో యారు. వీరు విజయవాడ పటమటకు చెందినవారు. ఆ కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. వారితోపాటు వెళ్లిన మరో విద్యార్థి నదిలోకి దిగకపోవడంతో మృత్యుంజయుడు అయ్యాడు. అతను పెనమలూరు మండలం సనత్‌నగర్‌కు చెందినవాడు.
విజయవాడ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : పటమట హైస్కూల్ రోడ్డుకు చెందిన నడుపల్లి నాగసాయి కార్తికేయ (13), కత్తి ప్రశాంత్ (13), సనత్‌నగర్‌కు చెందిన షారూక్ హైస్కూల్ రోడ్డులో ఉన్న నారాయణ పబ్లిక్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వారికి ఎన్టీఆర్ సర్కిల్‌కు చెందిన గగన్ (16) పరిచయమయ్యాడు. అతడు ఇంటర్మీడి యట్ చదువుతున్నారు. కొన్నాళ్లుగా ఈ నలుగురు మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా కలిసే ఉంటారు. వారిలో కార్తికేయ తల్లి వసుంధర నారాయణ హైస్కూల్‌కు వైస్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ తండ్రి శేఖర్ ఒంగోలులో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గగన్ తండ్రి హైదరాబా ద్‌లో ఇన్వెర్టర్ల కంపెనీలో ఉద్యోగి. గగన్ తల్లి, నాయనమ్మలతో కలిసి యనమ లకుదురు పుట్టరోడ్డులో ఉంటున్నాడు. ఆదివారం సెలవురోజు కావడంతో ఫొటోషూట్ చేసుకోవాలనుకున్నారు. అంతా కలిసి ఆటోలో యనమలకుదురు శివాలయం వద్ద ఉన్న పెట్రోలు బంకు పక్క నుంచి కృష్ణా నదిలోకి నడుచుకుంటూ వెళ్లారు. వారిలో షారూక్ మాత్రం ఫొటోలు దిగడానికి నీటిలోకి వెళ్లలేదు. కార్తికేయ, ప్రశాంత్, గగన్‌లు నది మధ్యలోకి వెళ్లి ఫొటోలు తీయించుకోవాలనుకున్నారు. ఇలా ఫొటోల కోసం దిగిన ముగ్గురు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న షారూక్ సమాచారంతో మత్స్యకారుల ద్వారా పోలీసులు మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. సరదాగా ఫొటోషూట్ కోసం వెళ్లిన వారిలో ముగ్గురు విద్యార్థులు జలసమాఽధి కావడంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఉన్నత విద్యావంతులను చేసి అత్యున్నత శిఖరాల్లో నిలబెట్టాలని భావించిన తల్లిదండ్రుల ఆశలు నీళ్లలో కలిసిపోయాయి. కుమారుల మృతదేహాలను చూసి నది వద్ద తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా రోదించారు. చనిపోయిన ముగ్గురు విద్యార్థులు చదువులో టాప్‌లో ఉంటారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
Updated Date - Jan 29 , 2024 | 01:14 AM