TDP: రికార్డు స్థాయిలో టీడీపీ మెంబర్‌షిప్
ABN, Publish Date - Dec 02 , 2024 | 12:34 PM
Andhrapradesh: తెలుగు దేశం పార్టీ సాధారణ సభ్యత్వం నేటికి (సోమవారం) 60 లక్షలు దాటింది. రోజుకు సరాసరి లక్షన్నర చొప్పున వివిధ వర్గాల ప్రజలు, కార్యకర్తలు సభ్యత్వం తీసుకుంటున్నారు. సభ్యత్వ నమోదులో నూతన సభ్యత్వాలు భారీగా పెరిగాయి. వాట్సాప్ ద్వారా సులభంగా సభ్యత్వం పొందే సౌకర్యాన్ని టీడీపీ అధిష్టానం కల్పించింది.
అమరావతి, డిసెంబర్ 2: తెలుగు దేశం పార్టీ మెంబర్‌షిప్ (TDP Membership) కార్యక్రమంలో రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. తెలుగు దేశం పార్టీ సాధారణ సభ్యత్వం నేటికి (సోమవారం) 60 లక్షలు దాటింది. రోజుకు సరాసరి లక్షన్నర చొప్పున వివిధ వర్గాల ప్రజలు, కార్యకర్తలు సభ్యత్వం తీసుకుంటున్నారు. సభ్యత్వ నమోదులో నూతన సభ్యత్వాలు భారీగా పెరిగాయి. వాట్సాప్ ద్వారా సులభంగా సభ్యత్వం పొందే సౌకర్యాన్ని టీడీపీ అధిష్టానం కల్పించింది. దీంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. అలాగే కార్యకర్తల సంక్షేమం కోసం రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమాను టీడీపీ కల్పించింది. ప్రాంతీయ పార్టీల చరిత్రలో ఎవరూ చేరుకోలేని స్థాయికి టీడీపీ సభ్యత్వ నమోదు చేరుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
TG News: కారుతో ఢీకొట్టి.. ఆపై కత్తితో దాడి చేసి.. హైదరాబాద్‌లో దారుణం
కాగా... అక్టోబర్ 26న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత ప్రారంభించారు. సభ్యత్వ నమోదులో భాగంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రూ.100 కట్టి సీఎం చేతుల మీదుగా మెుదటి సభ్యత్వాన్ని తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు రాష్ట వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు, నేతలు వివిధ స్థాయిల్లో కష్టపడి పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ కోసం పోరాడి అనేక కేసులు పెట్టించుకున్నారని, జైలుకు వెళ్లారని, ఆస్తులు పోగొట్టుకున్నారని చంద్రబాబు తెలిపారు. అలాంటి వారికి కచ్చితంగా టీడీపీ పార్టీ అండగా నిలబడుతుందని సీఎం చెప్పుకొచ్చారు.
నేడు మరోసారి రైతుల పాదయాత్ర.. కారణమిదే
అయితే.. రూ.100లు కట్టి సభ్యత్వం తీసుకుంటే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ప్రమాద బీమా వర్తిస్తుంది. రూ.లక్ష కడితే పార్టీలో శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. ప్రమాదవశాత్తూ చనిపోతే మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు తక్షణసాయం అందజేస్తారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆర్థికసాయం అందిస్తారు.
ఇవి కూడా చదవండి..
వార్ జోన్‌గా మారిన తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దు..
ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 02 , 2024 | 12:38 PM