ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి పెట్టాలి

ABN, Publish Date - Feb 01 , 2024 | 12:53 AM

విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనల వైపు కూడా దృష్టి పెట్టాలని విజ్ఞాన్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ గుంటూరు ప్రిన్సిపాల్‌ కె. ఫణీంద్ర కుమార్‌ చెప్పారు.

ఫణీంద్ర కుమార్‌ను సత్కరిస్తున్న ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ తదితరులు

విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి పెట్టాలి

విజ్ఞాన్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ ఫణీంద్ర కుమార్‌

మొగల్రాజపురం, జనవరి 31: విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనల వైపు కూడా దృష్టి పెట్టాలని విజ్ఞాన్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ గుంటూరు ప్రిన్సిపాల్‌ కె. ఫణీంద్ర కుమార్‌ చెప్పారు. పీబీ సిద్ధార్థ కళాశాల డిపార్ట్‌మెంట్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిపుణులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులతో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల్లో పరిశోధన దృక్పథం ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. నూతన ఆవిష్కరణలు సులువగా చేయాలంటే విద్యార్థులు సి, జావా లాంగ్వేజ్‌లు, డేటా మేనేజ్‌మెంట్‌, వెబ్‌ సర్వీసెస్‌, డేటా స్ట్రక్చర్‌లో నైపుణ్యం సాధించాలని సూచించారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోందని తద్వారా పరిఽశోధనలు సులభంగా త్వరితగతిన చేయవచ్చని చెప్పారు. కార్యక్రమం అనంతరం ముఖ్యఅతిఽథిని ఘనంగా సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌, డైరెక్టర్‌ వేమూరి బాబూరావు, డీన్‌ రాజేష్‌ జంపాల, సదస్సు కన్వీనర్‌ కంప్యూటర్‌ సైన్సు విభాగాధిపతి రవికిరణ్‌, జి. సామ్రాట్‌ కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:53 AM

Advertising
Advertising