ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇప్పటికీ సాయమందలే!

ABN, Publish Date - Oct 27 , 2024 | 01:03 AM

మండలంలో కృష్ణానది వరద ముంపు గ్రామాల బాధితులకు ఇంకా ప్రభుత్వ సాయమందలేదు.

కంచికచర్ల మండలంలోని తొమ్మిది గ్రామాలకు విడుదల కాని వరద సాయం

బాధితుల్లో పెల్లుబికుతున్న ఆగ్రహం

(ఆంధ్రజ్యోతి-కంచికచర్ల)

మండలంలో కృష్ణానది వరద ముంపు గ్రామాల బాధితులకు ఇంకా ప్రభుత్వ సాయమందలేదు. అధికారులు తొమ్మిది గ్రామాల్లో రీ ఎన్యూ మరేషన్‌ చేసి, నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. అయినప్ప టికీ ప్రభుత్వ సాయం రాకపోవటంతో బాధితులు ఆందోళన చెందుతు న్నారు. కంచికచర్ల మండలంలో కొత్తపేట, గనిఆత్కూరు, చెవిటికల్లు, కునికినపాడు, మున్నలూరు, మోగులూరు, ఎస్‌.అమరవరం, వేములపల్లి, పెండ్యాల గ్రామాలు ఒకవైపు కృష్ణానది, మరోవైపు మునేరు వరద ముం పునకు గురయ్యాయి. గ్రామాలు ద్వీపాలుగా మారాయి. కిలోమీటర్ల దూరం వరద పోటెత్తడంతో అధికారులు పడవల ద్వారానే ముంపు గ్రామాలకు చేరుకున్నారు. గ్రామాల్లోని పలు ఇళ్లల్లోకి రెండు నుంచి ఐదు అడుగుల మేర వరద నీరు చేరింది. బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లి అప్పట్లో తలదాచుకున్నారు. ధాన్యం తో పాటు తిండిగింజలు, గృహోపకరణాలు, విలువైన వస్తువులను నష్ట పోయారు. పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామా ల్లోని బాధితులకు ఒక్కో ఇంటికి రూ.25 వేల వంతున ప్రభుత్వం సాయ మందించింది. పక్క మండలంలో అంది తమకు సాయమందకపోవ డంతో బాధితుల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. రీఎన్యూమరేషన్‌ జరిగి నెల కావస్తున్నప్పటికీ సాయం రాకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెవిటికల్లుకు చెందిన పలువురు మహిళలు గురువారం కంచికచర్ల తహ సీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సాయం అందించాలంటూ నినాదాలు చేశారు.

రీ ఎన్యూమరేషన్‌ చేసి నెల కావస్తున్నా..

బాధితులకు జరిగిన అన్యాయం గురించి ‘మాకు సాయం చేయరా?’ అంటూ సెప్టెంబరు 27న ఆంధ్రజ్యోతిలో కథనం రావటంతో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. అప్పటి కలెక్టర్‌ సృజన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారయంత్రాంగంలో కదలిక వచ్చింది. 28వ తేదీ నుంచి తొమ్మిది గ్రామాల్లో రెవెన్యూ అధికారులు రీ ఎన్యూమరేషన్‌ చేశారు. గ్రామాలవారీగా వరద ముంపు బాధితుల జాబితాలను తయా రుచేసి, ఉన్నతాధికారులకు నివేదించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం సాయం విడుదల కాలేదు.

సీఎంకు విన్నవించిన బాధితులు

చెవిటికల్లుకు చెందిన కొంత మంది మహిళలు శనివారం ప్రజాద ర్బార్‌లో విన్నవించేందుకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయా నికి వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. వరద సాయం అందలేదని వివరిస్తూ..సీఎంకు విజ్ఞాపన పత్రం అంద జేశారు. సమస్యను పరిష్కరించి, న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారని బాధితులు పేర్కొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 01:03 AM