శంకరన్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలి
ABN, Publish Date - Oct 17 , 2024 | 12:51 AM
నిరుపేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి, వాటి అమలుకు పాటుపడిన ఆదర్శనీయుడు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని ఎస్‌ఆర్ శంకరన్ మెమోరియల్ కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శంకరన్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలి
మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్
గవర్నర్‌పేట, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి, వాటి అమలుకు పాటుపడిన ఆదర్శనీయుడు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని ఎస్‌ఆర్ శంకరన్ మెమోరియల్ కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లెనిన్ సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ ఐక్యతా భవన్‌లో మెమోరియల్ కమిటీ సమావేశం జరిగింది. ఈనెల 22న శంకరన్ 90వ జయంతి జరుగనున్న సందర్భంగా వివిధ దళిత సంఘాల నేతలు, కన్వీనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యతా భవన్ ప్రాంగణంలో శంకరన్ కాంస్య విగ్రహం ఏర్పాటు సమయం నుంచి నేటి వరకు ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు కమిటీనే నిర్వహిస్తోందని గుర్తుచేశారు. శంకరన్ వంటి నిబద్ధత, అంకిత భావం కలిగిని అధికారిని స్మరించుకుకోవడం మంచి సంప్రదాయమన్నారు. సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, డీబీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నవరపు నాగేశ్వరరావు, వివిధ సంఘాల నేతలు పరిశపోగు రాజేష్, బుట్టి రాయప్ప, జాన్సన్‌బాబు, పేరయ్య పాల్గొన్నారు.
Updated Date - Oct 17 , 2024 | 12:51 AM