ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:42 AM

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యం గా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు దానికి సంబంధించి అర్జీదా రులకు వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ తహసీల్దార్‌ జాలాది విమలకుమారికి సూచించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.

కేసరపల్లిలో లబ్ధిదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ డీకే బాలాజీ

ఉంగుటూరు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యం గా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు దానికి సంబంధించి అర్జీదా రులకు వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ తహసీల్దార్‌ జాలాది విమలకుమారికి సూచించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. భూ సమస్యలకు సంబంధించి ఇళ్లస్థలాల పంపిణీ ఫైళ్లు, ఆర్‌ఓఆర్‌ రిజెక్షన్స్‌, మ్యుటేషన్స్‌ ఫైళ్లను తనిఖీ చేశారు.

ఆత్కూరు గ్రామాన్ని సోలార్‌ మోడల్‌ విలేజ్‌గా తయారు చేయాలి

పీఎం సూర్యఘర్‌ పథకం కింద ఆత్కూరు గ్రామాన్ని మోడల్‌ సోలార్‌ విలేజ్‌గా తయారు చేయాలని, ఈ పథకం పట్ల ప్రజలకు తగిన అవగాహన కల్పించాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయంనుంచి నేరుగా ఆత్కూరులోని స్వర్ణభారత్‌ట్రస్ట్‌కు చేరుకున్న ఆయన అక్కడ సమావేశపు హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. తొలుత ట్రస్ట్‌ ఈడీ డి.పరదేశి ట్రస్ట్‌ చేస్తున్న కార్యకలాపాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ట్రస్ట్‌ ప్రాంగణంలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లో వివిధ ట్రేడుల్లో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలను కలెక్టర్‌ పరిశీలించారు.

పీహెచ్‌సీ భవనాన్ని అందుబాటులోకి తేవాలి

అనంతరం గ్రామంలో నిధులలేమితో ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారిన నూతన పీహెచ్‌సీ భవనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, జడ్పీ సీఈవో కన్నమనాయుడు, ఎల్డీఎం జయవర్థన్‌, విద్యుత్‌శాఖ అధికారి భాస్కరరావు, నెడ్‌కాప్‌ అధికారి మౌలాలి, తహసీల్దార్‌ జె.విమలకుమారి, ఎంపీడీవో ఈ.సత్యకుమార్‌, ఈవోపీ ఆర్డీ వి.దిలీప్‌కుమార్‌, పీఆర్‌ ఏఈ జి.శ్రీనివాస్‌, పీఎం సూర్యఘర్‌ పథకం నోడల్‌ అధికారులు, ఆత్కూరు పంచాయతీ కార్యదర్శి గంటా అప్పారావు, టీడీపీ మం డల అధ్యక్షుడు ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

లేఅవుట్‌లో సమస్యలు పరిష్కరిస్తాం

గన్నవరం : లబ్ధిదారులందరూ మార్చిలోగా గృహ నిర్మాణాలు పూర్తిచేసుకుని త్వరితగతిన బిల్లులు పెట్టుకో వాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ సూచించారు. మండ లంలోని కేసరపల్లి లే అవుట్‌ను శుక్రవారం పరిశీలిం చారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకు న్నారు. వెళ్లేందుకు రహదారి లేదని, తాగునీటి, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. దీంతో కలెక్టర్‌ స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటా మన్నారు. గుడివాడ ఆర్డీవో బాలసుబ్రమణ్యం, హౌసింగ్‌ పీడీ ఎస్‌ వెంకట్రావు, ఈఈ రత్నశ్రీధర్‌, సర్పంచ్‌ చేబ్రోలు లక్ష్మీమౌనిక, తహసీల్దార్‌ కేవీ శివయ్య, ఎంపీడీవో టి.స్వర్ణలత, హౌసింగ్‌ డీఏ రామోజీ నాయక్‌, ఏఈ ఎం. సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:42 AM