ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్‌ఎస్‌ఎంలో మౌంట్‌ జెనిత్‌ క్రీడా పోటీలు ప్రారంభం

ABN, Publish Date - Nov 10 , 2024 | 12:51 AM

పటమట ఎన్‌ఎస్‌ఎం పాఠశాలలో మౌంట్‌ జెనిత్‌ పేరిట 35వ జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలు శనివారం ప్రారంభం అయ్యాయి.

మార్ఛ్‌ఫాస్ట్‌ చేస్తున్న వివిధ పాఠశాలలు విద్యార్థులు

ఎన్‌ఎస్‌ఎంలో మౌంట్‌ జెనిత్‌ క్రీడా పోటీలు ప్రారంభం

పటమట, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : పటమట ఎన్‌ఎస్‌ఎం పాఠశాలలో మౌంట్‌ జెనిత్‌ పేరిట 35వ జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలు శనివారం ప్రారంభం అయ్యాయి. ఈ పోటీల్లో 30 పాఠశాలలు నుంచి 1200 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, ఈ నెల 11 వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ముఖ్య అతిథులు రెవరెండ్‌ బ్రదర్‌ షైన్‌ అలెక్స్‌, క్లీన్‌కృష్ణా, గోదావరి కెనాల్స్‌ ఎండీ డాక్టర్‌ కిషోర్‌కుమార్‌లు జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి తదనుగుణంగా వారికి అభిరుచి ఉన్న క్రీడలపట్ల శిక్షణ అందించాలన్నారు. బ్రదర్‌ షైన్‌ అలెక్స్‌ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులకు సమానమైన అవకాశాలు కల్పించాలని సూచించారు. పాఠశాల మొదటి రోజున జరిగిన అథ్లెటిక్స్‌ ఫలితాల్లో 1500 మీటర్ల బాలుర పరుగులో సెయింట్‌ గాబ్రియెల్‌స్కూల్‌ ఖాజీపేట (ప్రథమ), ఎస్‌ఎస్‌ఎం స్కూల్‌ విజయవాడ(ద్వితీయ), సెయింట్‌ మార్క్సు టౌన్‌ హైస్కూల్‌ హైదరాబాద్‌(తృతీయ)స్థానాలు సాధిం చాయి. 800 మీటర్ల బాలికల విభాగంలో లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ హైదరాబాద్‌(ప్రథమ), ఆల్‌సెయింట్స్‌ స్కూల్‌ హైదరా బాద్‌ (ద్వితీయ), మౌంట్‌ఫోర్డు స్కూల్‌ గోపాలపురం (తృతీయ స్థానం)లు వశం చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ రాయప్పరెడ్డి, రెవరెండ్‌ బ్రదర్‌ మోంటీ, బ్రదర్‌ బాలారెడ్డి, పూణే ప్రావిన్స్‌ ప్రొవిన్షియల్‌ సుపీరియర్‌ జైకె జెర్వాసిన్‌, బ్రదర్‌ సంతోష్‌కుమార్‌, బ్రదర్‌ షాజన్‌ ఆంటోనీలు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:51 AM