లోకేశ్ తెగువ, ఓర్పు యువతకు ఆదర్శం
ABN, Publish Date - Jan 24 , 2024 | 12:06 AM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో చూపిన తెగువ, ఓర్పు యువతకు ఆదర్శమని మాజీ మంత్రి , టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.
మచిలీపట్నం టౌన్, జనవరి 23 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో చూపిన తెగువ, ఓర్పు యువతకు ఆదర్శమని మాజీ మంత్రి , టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. నారా లోకేశ్ జన్మదిన వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహిం చారు. తాళ్ళపాలెంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కేక్ కట్ చేశారు. తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, రూరల్ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, నాయకులు లంకే శేషగిరి , కొనకళ్ళ నాగరాజు, జొన్నల బాబూరావు, గోపు నరేష్, కొక్కిలిగడ్డ జయకృష్ణ, వంకా బుజ్జి, అడ్డాల రామాంజనేయులు, మద్లాల బాబూరావు, చిన్నం శేఖర్, మాదిరెడ్డి శ్రీను, సలీం, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. గుడివాడ : నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వెనిగండ్ల రాము కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. జనసేన ఇన్‌చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, దింట్యాల రాంబాబు, మురళీ, గుత్తా చంటి, లింగం ప్రసాద్, జనసేన నాయకులు మజ్జి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. తోట్లవల్లూరు : తోట్లవల్లూరు బస్టాండ్ సెంటర్లో నారా లోకేశ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, మండల తెలుగురైతు అధ్యక్షుడు నెక్కలపూడి మురళీ కేక్ కట్ చేశారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు గొరిపర్తి గోపయ్య, పంచాయితీ సభ్యురాలు గోలి సింహాచలం, వల్లూరు రాంబాబు, జుజ్జువరపు పద్మజ, గోలి, షేక్ సలామ్ తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ : నారా లోకేశ్ నేటి యువతకు ఆశాదీపం అనడంలో ఎటువంటి సందేహం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. లోకేశ్ జన్మదిన వేడుకలను టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్, జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, రైతు నాయకులు బావిరెడ్డి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు బండే కనకదుర్గ, మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి : నారా లోకేశ్ జన్మదిన వేడుకలు మోపిదేవిలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద కేక్‌ను ఎంపీపీ రావి దుర్గావాణి కట్ చేసి మహిళా నాయకులకు తినిపించారు. మండల పార్టీ అధ్యక్షుడు నడకుదుటి జనార్దనరావు మిఠాయిలను పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. రావి నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి, గవిని శివరామకృష్ణ, కావూరి రామకృష్ణ, అత్తలూరి రమేష్, పొలిమేట్ల ఏసుబాబు, దొబ్బలపూడి జగదీష్, పవన్ కుమార్, రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరులు ఉన్నారు. చల్లపల్లి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన ్మదిన వేడుకలు చల్లపల్లిలో ఘనంగా జరిపారు ఏటీఎం సెంటర్‌లో మండల టీడీపీ అధ్యక్షుడు మోర్ల రాంబాబు, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ మహిళా కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. పంచాయతీ ఉపసర్పంచ్ ముమ్మనేని రాజ్ కుమార్ (నాని), నేతలు నిడమానూరు దిలీప్ కుమార్, రావి చంద్రశేఖర్, షేక్ నబి ఘోరి, పరిశె మౌళి, మోర్ల శివ, మాలెంపాటి శ్రీనివాసరావు, పైడిపాముల స్వప్న, కోట సత్యం, పద్మ, బోలెం నాగమణి, బావిశెట్టి కనకదుర్గ, జల్లూరి ప్రసాద్, అంబటి భువనేశ్వరరావు, తాతా ప్రదీప్, షేక్ సిలార్ పాల్గొన్నారు. కోడూరు : కోడూరు ప్రధాన సెంటర్‌లో మాజీ ఎంపీపీ పెద్ది భాస్కరరావు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. టీడీపీ నాయకులు మాచర్ల భీమయ్య, మర్రే గంగయ్య, పాలడుగు ఆనందరావు, కాగిత రామారావు, బడే వీరబాబు, బడే గాంధీ, తోట దామోదర్‌రావు, నాగం బాపయ్య, బడే ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం వద్ద కూరాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్‌ను కట్ చేసి మిఠాయిలు పంచారు. మండల టీడీసీ అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, కూరాకుల శివయ్య, తండు గంగాధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగాయలంక : శ్రీకాకుళం గ్రామంలో నారా లోకేశ్‌జన్మదిన వేడుకలను రాష్ట్ర తెలుగుయువత నాయకులు, శ్రీకాకుళం ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం, పాపవినాశనం, వెలివోలు, వీరమాచినేనిపాలెం గ్రామాల్లో తాడికొండ చిన్నా ప్రెండ్స్ సర్కిల్ సహకారంతో రూ.30 వేలతో ఏడు సిమెంట్ బల్లలను ఏర్పాటు చేశారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసం రామకృష్ణ, కుంపటి చిట్టిబాబు, కటారి తాతయ్య, పువ్వాడ రవి, వేమూరి సాయి, శీలం శ్రీను, మాదాసు వినయ్, కొండవీటి కోటి, దుర్గ నాని, కొర్రపాటి కృష్ణ, కొడాలి సాంబశివరావు, కోన వెంకటేశ్వరరావు, జీళ్ల శ్రీనివాసరావు, తిరుమలశెట్టి రాంబాబు, బోడి సాంబశివరావు, సోమిశెట్టి రమేష్, ఆత్కూరి సిద్ధు, టీడీపీ, జన సేన నాయకులు పాల్గొన్నారు. అవనిగడ్డ రూరల్ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా 40 మంది నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. షిర్డి సాయి అన్నప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు, బచ్చు రఘునాథ్, యలవర్తి చిన్నా, ఘంటసాల రాజమోహనరావు పాల్గొన్నారు. పామర్రు : నారా లోకేశ్‌జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచారు. కుదరవల్లి ప్రవీణ్‌చంద్ర, వల్లూరిపల్లి గణేష్, మండపాక శంకర్‌బాబు, దాలిపర్తి ప్ర సాద్, కేదారాశిపల్లి శ్రీనివాసరావు ,పానుగంటి సందీప్, గొట్టిపాటిలక్ష్మీదాస్, జన్ను శోబాన్‌బాబు, దాడి పవన్ పాల్గొన్నారు.
Updated Date - Jan 24 , 2024 | 12:06 AM