వ్యక్తిగత బ్యాంకు, ఆధార్ వివరాలను గోప్యంగా ఉంచండి
ABN, Publish Date - Nov 28 , 2024 | 12:49 AM
ఆర్థిక మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత బ్యాకు, ఆధార్ వివరాలను గోప్యంగా ఉంచాలని ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.రవికుమార్ అన్నారు.
వ్యక్తిగత బ్యాంకు, ఆధార్ వివరాలను గోప్యంగా ఉంచండి
ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.రవికుమార్
లబ్బీపేట, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత బ్యాకు, ఆధార్ వివరాలను గోప్యంగా ఉంచాలని ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.రవికుమార్ అన్నారు. ది కృష్ణా డిస్ర్టిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సైబర్ మోసాలపై ముద్రించిన కరపత్రాన్ని ఆయన బుధవారం బెంజిసర్కిల్‌లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సైబర్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మూర్తి మాట్లాడుతూ నేరాలపై ప్రజలను చైతన్యపరచడానికి కరపత్రాల పంపిణీ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం బెంజి సర్కిల్ వద్ద ఈ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నాగమోతు రాజా, ప్రధాన కార్యదర్శి అల్లాడ వీరవెంకట సత్యనారాయణ, రావి శరత్, పొట్లూరి చంద్రశేఖర్ ఇతర అసోసియేషన్ ప్రతినిధులు, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Nov 28 , 2024 | 12:49 AM