ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జంక్షన్‌లో వరుస దొంగతనాలు

ABN, Publish Date - Jan 29 , 2024 | 01:00 AM

జంక్షన్‌ నాలుగు రోడ్లు కూడలకి అతి సమీపంలోని మూడు దుకాణాల్లో గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి చోరీ యత్నానికి పాల్పడ్డారు. బాపులపాడు సిద్ధార్థ స్కూల్‌ సమీపంలోని తాళం వేసి ఉన్న ఇంటిలోకి ప్రవేశించి రూ. 4.5లక్షలు విలువ చేసే 9 కాసుల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న వరుస ఘటనలు జంక్షన్‌లో తీవ్ర సంచలనం రేకెత్తించాయి.

ఫమూడు దుకాణాల్లో చోరీకి యత్నం

ఫతాళం వేసి ఉన్న ఇంట్లో 9 కాసుల బంగారం చోరీ

హనుమాన్‌జంక్షన్‌, జనవరి 28: జంక్షన్‌ నాలుగు రోడ్లు కూడలకి అతి సమీపంలోని మూడు దుకాణాల్లో గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి చోరీ యత్నానికి పాల్పడ్డారు. బాపులపాడు సిద్ధార్థ స్కూల్‌ సమీపంలోని తాళం వేసి ఉన్న ఇంటిలోకి ప్రవేశించి రూ. 4.5లక్షలు విలువ చేసే 9 కాసుల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న వరుస ఘటనలు జంక్షన్‌లో తీవ్ర సంచలనం రేకెత్తించాయి. సేకరించిన వివరాల మేరకు.. స్థానిక గుడివాడ రోడ్డులో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని మినీ ఆపోలో మెడికల్‌ షాపు, జయలక్ష్మి జనరల్‌ స్టోర్స్‌, మోడల్‌ డెయిరీ దుకాణాల్లో గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి చోరీ యత్నానానికి పాల్పడ్డారు. అయితే ఈ దుకాణాల్లో విలువైన ఆస్తి లేకపోవడంతో దుకాణాల యజమానులు ఊపి రిపీల్చుకున్నారు. సిద్ధార్ధ స్కూల్‌ సమీపంలో నివాసం ఉండే ఎఫ్‌సీఐ ఉద్యోగి మూడే రూప్లానాయక్‌ మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో ఊరు వెళ్లారు. దుండగులు తాళాలు పగల కొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 9 కాసుల బంగారు అభరణాలను దోచుకుపోయారు. మచిలీప ట్నం నుంచి క్లూస్‌ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జనార్దన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jan 29 , 2024 | 01:00 AM

Advertising
Advertising