ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పరిశ్రమల నడ్డి విరిచిన జగన్‌రెడ్డి

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:31 AM

ఐదేళ్లలో సీఎం జగన్‌రెడ్డి విద్యుత్‌ చార్జీలు ఇష్టారాజ్యంగా పెంచి రాష్ట్రంలో పరిశ్రమల నడ్డి విరవడమేకాక పరిశ్రమలు రాకుండా చేశారని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ ఆరోపించారు.

ఆత్మీయ సమావేశంలో వసంత కృష్ణప్రసాద్‌

గొల్లపూడి, మార్చి 27: ఐదేళ్లలో సీఎం జగన్‌రెడ్డి విద్యుత్‌ చార్జీలు ఇష్టారాజ్యంగా పెంచి రాష్ట్రంలో పరిశ్రమల నడ్డి విరవడమేకాక పరిశ్రమలు రాకుండా చేశారని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ ఆరోపించారు. గొల్లపూడిలో బుధవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలు పెరగడం పరిశ్రమలు రాకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. బిల్లులు కూడా అధికంగా వసూళ్లు చేస్తూ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు. వందల్లో వచ్చే బిల్లులు కాస్త వేలల్లో రావడంతో చిన్న చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతిందన్నారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ అమలు చేయకుండా ఎస్సీలను ఈప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో బీజేపీ, జనసేన నేతలను, కార్యకర్తలను కలుపుకొని రానున్న ఎన్నికల్లో పని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ - తెలుగుదేశం - జనసేన కూటమి మైలవరం నియోజకవర్గంలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బొమ్మసాని సుబ్బారావు, జంపాల సీతారామయ్య, కె.విజయబాబు, ఉయ్యూరు వెంకట నరసింహారావు, జువ్వా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కోదండరామస్వామిని దర్శించుకున్న వసంత

ఇబ్రహీంపట్నం: తుమ్మలపాలెంలో శ్రీ హనుమత్‌ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి నూతన ఆలయ బింబ ధ్వజప్రతిష్ఠ మహోత్సవం బుధవారం నేత్ర పర్వంగా జరిగింది. వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ స్వామి వారిని, దేవతా మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:31 AM

Advertising
Advertising