కురిసింది వాన!
ABN, Publish Date - Oct 15 , 2024 | 01:18 AM
నగరంలో సోమవారం సాయంత్రం వాన కురిసింది..
బందరు రోడ్డులో వర్షపు నీటిలో ప్రయాణిస్తున్న వాహనాలు
నగరంలో సోమవారం సాయంత్రం వాన కురిసింది.. దీంతో పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. దసరా సెలవులు ముగిసి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కావడం, ఇతర ప్రాంతాల నుంచి నగరం మీదుగా సెలవులకు వచ్చి వెళ్తున్న వారి వాహనాలు, బస్సుల కారణంగా రద్దీ ఏర్పడడం, దానికి తోడు ట్రాఫిక్ స్తంభించిపో వడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.
- విజయవాడ
Updated Date - Oct 15 , 2024 | 01:18 AM