ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆయిల్‌పామ్‌ సాగుకు వంద శాతం రాయితీ

ABN, Publish Date - Nov 05 , 2024 | 12:45 AM

ఆయిల్‌పామ్‌ తోటల సాగును విస్తరింపజేసే లక్ష్యంతో వంద శాతం రాయితీతో రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్యాన అధికారి చందు జోసఫ్‌ సుందరం తెలిపారు.

ఉద్యాన అధికారి చందు జోసఫ్‌

తోట్లవల్లూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ తోటల సాగును విస్తరింపజేసే లక్ష్యంతో వంద శాతం రాయితీతో రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్యాన అధికారి చందు జోసఫ్‌ సుందరం తెలిపారు. మండలంలోని భద్రిరాజుపాలెం, చాగంటిపాడు గ్రామాల్లో సోమవారం ఆయిల్‌పామ్‌ తోటల సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. నీరు నిలవని నల్లరేగడి భూముల్లో ఆయిల్‌పామ్‌ తోటలను సాగు చేయొచ్చన్నారు. మొక్కలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని, మెయింటినెన్స్‌ రాయితీ కింద నాలుగేళ్ల పాటు ఎకరాకు రూ.2,100, పంట దిగుబడి వచ్చే వరకు నాలుగేళ్లపాటు మరో రూ.2,100, 50 శాతం రాయితీపై పనిముట్లు ఇవ్వటంతో పాటు ఉపాధిహామీ కింద ఈ తోటల్లో కూలీలు పనిచేసే అవకాశం కల్పించి రైతులకు లాభం కలిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చందు జోసఫ్‌ వివరించారు.

Updated Date - Nov 05 , 2024 | 12:45 AM