ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎస్మా చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

ABN, Publish Date - Jan 09 , 2024 | 01:18 AM

ప్రభుత్వం అంగన్వా డీలపై ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని తక్షణం ఉప సంహరించుకోవాలని సీఐటీయూ నేతలు సీహెచ్‌ సుధాకర్‌, ఎం.మహేష్‌ డిమాండ్‌ చేశారు.

నందిగామలో గుంజీలు తీస్తూ అంగన్వాడీల నిరసన

అంగన్వాడీల డిమాండ్‌

28వ రోజూ కొనసాగిన నిరసనలు

మైలవరం, జనవరి 8: ప్రభుత్వం అంగన్వా డీలపై ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని తక్షణం ఉప సంహరించుకోవాలని సీఐటీయూ నేతలు సీహెచ్‌ సుధాకర్‌, ఎం.మహేష్‌ డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు సోమవారం నిరాహార దీక్షను కొనసాగించారు. పుష్పకుమారి, శారద, అరుణ, బుల్లిమ్మ, నిర్మల, లలితకుమారి, మేరికుమారి, పద్మ రాజేశ్వరి, ఉష పాల్గొన్నారు.

వినూత్న నిరసన

తిరువూరు: తమ సమస్యలు పరిష్కరించాలని 28 రోజులుగా రెవెన్యూ కార్యాలయం ఆవరణలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఎస్మా ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఎస్మా పదం ఆకారంలో కూర్చుని కొందరు, మానవహారంగా మరికొందరు నిరసన తెలి పారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు నాగమణి, సుజాత, చిట్టెమ్మ, జ్యోతి, ఉష, రాణికుమారి, నిర్మల, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, సునీత, సీఐటీయూ నేతలు పాల్గొన్నారు.

వైసీపీకి అధికారమిచ్చి తప్పుచేశాం.. ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం

నందిగామ: ‘‘ వైసీపీకి అధికారమిచ్చి తప్పు చేశాం. ఫలితంగా గుంజీలు తీసి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం.’’ అని అంగన్వాడీ కార్యకర్తలు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ వినూత్న నిర సన తెలిపారు. అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన 28వ రోజుకు చేరింది. అంగన్వాడీలు ఓట్లేసి గెలిపించినందుకు పాపప్రక్షాళనగా గుంజీలు తీస్తు న్నామని అన్నారు. అంగన్వాడీలను చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రికి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పి తీరుతామన్నారు. తక్షణమే తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అంగ న్వాడీ, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

అంగన్వాడీల కోలాటం

జగ్గయ్యపేట: జగ్గయ్యపేటలో అంగన్వాడీ కార్యకర్తలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కోలాటం చేస్తూ నిరసన తెలిపారు. ప్రభు త్వం ఎస్మా ప్రయోగించినా భయపడబోమని, డిమాండ్లు ఆమోదిం చేంత ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Jan 09 , 2024 | 01:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising