ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN, Publish Date - Dec 10 , 2024 | 12:53 AM

దివ్యాంగుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లి వాటిలో సాధ్యమైనన్ని సమస్యలను పరిష్కరించేలా చూస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే గద్దెకు సమస్యలు వివరిస్తున్న అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

పటమట, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లి వాటిలో సాధ్యమైనన్ని సమస్యలను పరిష్కరించేలా చూస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ హామీ ఇచ్చారు. అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయ ఆవరణలో రాష్ట్ర వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 32వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథి గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమా నికి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారని వివరించారు. సీఎం చంద్రబాఋ ఎన్నికల్లో చెప్పిన విధంగానే రూ.3వేలు ఉన్న దివ్యాంగుల పింఛన్‌ రూ.6వేలుకు పెంచారని, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించడం, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్ట పరిహారం అందజేయడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ మాటాడుతూ దివ్యాంగుల పింఛన్లు రూ.6వేలకు పెంచినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేయడమే కాకుండా వ్యక్తిగతంగా వారి జీవనోపాధికి సహాయం చేస్తానన్న ఎమ్మెల్యే గద్దెకు లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో సంఘ కార్యదర్శి షేక్‌ నూర్‌ అహ్మద్‌, సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మన బోయిన రమేష్‌, మహిళా నాయకురాలు బేబి సరోజిని, ఏసుగంటి కృష్ణారావు, అమ్ములు, వీరభద్రం, సతీష్‌కుమార్‌లు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అభినందనలు

కార్యకర్తలే టీడీపీకి పెట్టని కోట అని, అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అభినందనల్లో ముంచెత్తారు. తూర్పులో టీడీపీ యాప్‌ను చురుగ్గా వినియోగిస్తూ టీడీపీ కోసం ఒక డిజిటల్‌ సైనికుడిలాగా పనిచేసిన ఏడుగురు కార్యకర్తలకు రాష్ట్ర పార్టీ బహుమ తులను అందజేసింది.

సదరు గిఫ్ట్‌ ప్యాకెట్‌లను అడపా శివనాగేం ద్రరావు, మందల రాజ్యలక్ష్మి, బొల్లు ధన్యశ్రీ, పెరసాని వసంత్‌, వీఎంఎస్‌రావు, కొత్తా మురళీ, కోగంటి రాంబాబులకు గద్దె రామ్మోహన్‌ అందజేశారు.

Updated Date - Dec 10 , 2024 | 12:53 AM