శైవ క్షేత్రాలకు కార్తీక శోభ
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:06 PM
బత్తలపల్లి మండ లంలోని శివాలయాలకు కార్తీక శోభ సంతరిం చుకుంది. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి.. స్వామి వారిని దర్శించుకున్నారు
ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్ : బత్తలపల్లి మండ లంలోని శివాలయాలకు కార్తీక శోభ సంతరిం చుకుంది. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి.. స్వామి వారిని దర్శించుకున్నారు. మండలంలోని సంఘ మేశ్వర క్షేత్రానికి, సంజీవపురం సమీపంలోని కాటికోటేశ్వర క్షేత్రానికి, బత్తలపల్లిలో కొత్తగా నిర్మించిన లలితా త్రిపుర సుందరిదేవి ఓంకారేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కదిరి పట్టణంలోని శివాలయంలో శివలింగ, శివ పార్వతులను ప్రత్యేకంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. ధర్మవరం మండలంలోని కుణుతూరు గ్రామంలో వెలసిన పురాతన ఆలయమైన శ్రీచంద్రమౌ ళేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి కాటకోటేశ్వరక్షేత్రంలో, ఓడీసీ మండలం గౌనిపల్లి సమీపంలో సామ్రాజుల కొండలోని అక్కదేవతల ఆలయంలో అక్కదేవల ఆఖండ జ్యోతి ప్రజ్వలన ఘనంగా నిర్వహించారు. పలగలపల్లికి చెందిన దేవనాగప్ప, దేమ మునెమ్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేశారు.
Updated Date - Nov 25 , 2024 | 11:06 PM