ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

ABN, Publish Date - Jan 29 , 2024 | 10:12 PM

వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని బీజేీ ప రాజంపేట అసెంబ్లీ కన్వీనర్‌ రామజగదీశ్‌ తెలిపారు. సోమవారం సుండుపల్లె మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమా వేశంలో ఆయన మాట్లాడారు.

సుండుపల్లె: మాట్లాడుతున్న బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ రామజగదీశ్‌

సుండుపల్లె, జనవరి 29: వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని బీజేీ ప రాజంపేట అసెంబ్లీ కన్వీనర్‌ రామజగదీశ్‌ తెలిపారు. సోమవారం సుండుపల్లె మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలన లో ఇసుక, మట్టి అమ్ముకొని ఎమ్మెల్యేలు, ఎంపీ లు, నాయకులు అభివృద్ధి చెందారు. కానీ ప్రజ లకు ఎటువంటి మంచి జరగలేదని విమర్శిం చారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పథకాలుగా అందించి ప్రజలను మోసం చేస్తు న్నారని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 9నుంచి నిర్వహించ నున్న పల్లెకు పోదాం కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు రాయుడు, వెంకట్రా మరాజు, వెంకట్రమణనాయుడు, నరేంద్రరాజు, రెడ్డెయ్యఆచారి, సత్యంనాయుడు, సుబ్బరామ రాజు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

వీరబల్లి: వైసీపీ హయాంలో అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించడం లేదని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ రామజగదీశ్‌, జిల్లా కార్యదర్శి వీరబల్లి నరేంద్రగౌడ్‌ అన్నారు. వీరబల్లిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ఈ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోం దన్నారు. ప్రభుత్వంలో నాయకులు ఇసుక, మట్టి, అమ్ముకుని లక్షలు గడించారు తప్ప , అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మయోజన ద్వారా చేతి వృత్తుల వారికి రుణాలతోపాటు, పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలపై పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్య క్రమంలో మండల ఇన్‌చార్జి వెంకట్రామరాజు, ప్రధాన కార్యదర్శి జగన్నాఽథ, ఉపాధ్యక్షులు ఆంజనేయులురెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు సుబ్బరాజు, సీనియర్‌ నాయకులు లక్ష్మీకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు: ‘పల్లెకు పోదాం’ కార్యక్రమంతో ప్రతి గడపకు బీజేపీని తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. సోమ వారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పనతల సురేష్‌, అసెంబ్లీ కన్వీనర్‌ గడ్డం చంగల్‌రాజు ఆధ్వర్యం లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెకుపోదాం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి గడపకు వెళ్లి బీజేపీ సంక్షేమ కార్యక్రమా లను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు తోట శ్రీనివా సులు, ఆదినారాయణ, గాదెల శ్రీనివాసులు, జోగినేని సుబ్బారావు, బాపూజీ, టి. సుబ్బరా యుడు, నాగేశ్వర్‌రాజు, వరికూటి మల్లికార్జున, నాగినేని బాలసుబ్రహ్మణ్యం, విశ్వనాథం నాయు డు, శంకర్‌రాజు, కుశల్‌యాదవ్‌, మణిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 10:12 PM

Advertising
Advertising