ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహోన్నతమైనది భారత రాజ్యాంగం

ABN, Publish Date - Nov 27 , 2024 | 12:23 AM

‘మహోన్నతమైనది భారత రాజ్యాంగం’అని రాజ్యసభ మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ కాంగ్రెస్‌ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్‌ తులసిరెడ్డి, మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సంగటి మనోహర్‌ అన్నారు.

సంఘీభావం తెలుపుతున్న వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు

కడప మారుతీనగర్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘మహోన్నతమైనది భారత రాజ్యాంగం’అని రాజ్యసభ మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ కాంగ్రెస్‌ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్‌ తులసిరెడ్డి, మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సంగటి మనోహర్‌ అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సంగటి మనోహర్‌ అధ్యక్షతన ఐక్య ప్రజాస్వామ్య సమ్మేళనం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి టీడీపీ ముస్లిం నాయకుడు వి.ఎస్‌. అమీర్‌బాబు, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, శాంతి సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు రాజారత్నం ఐజాక్‌, న్యాయవాది షేక్‌ అమీనపీరాన, అఖిలపక్ష నాయకులు బి. నారాయణరెడ్డి, హేతువాద సంఘం జిల్లా కన్వీనర్‌ సి.ఆర్‌.వి. ప్రసాద్‌, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర నాయకడు జె.వి.రమణ మాట్లాడారు. భారత రాజ్యాంగ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

Updated Date - Nov 27 , 2024 | 12:23 AM