ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కలగా మిగిలిన ఆర్టీసీ డిపో

ABN, Publish Date - Jan 29 , 2024 | 11:38 PM

అదిగో ఆర్టీసీ డిపో... ఇదిగో వచ్చే నెలలో ప్రా రంభించేస్తాం. బస్సులొచ్చేస్తాయ్‌.. మాపార్టీ హామీ నెలబెట్టుకుంటుంది. అంటూ ఒకటి కాదు రెండు కాదు పదిహేడేండ్లుగా బి.కొత్తకోట వాసు లను రాజకీయ పార్టీలు ఊరిస్తూనే ఉన్నాయి.

ఇటీవల ఆర్టీసీ డిపో ఏర్పాటుపై అధికారులతో చర్చిస్తున్న ఎమ్యెల్యే ద్వారకనాథ్‌రెడ్డి(ఫైల్‌) దాతలు ఇచ్చిన స్థలంలో నిర్మించిన బస్సు షెల్టర్‌

ఫ పదిహేడేళ్లుగా అదిగో.. ఇదిగో.. అంటూ బి.కొత్తకోటవాసులను ఊరిస్తున్న పాలకులు ఫఎన్నికల హామీ ఎప్పటికి నెరవేరేను

బి.కొత్తకోట జనవరి 29 : అదిగో ఆర్టీసీ డిపో... ఇదిగో వచ్చే నెలలో ప్రా రంభించేస్తాం. బస్సులొచ్చేస్తాయ్‌.. మాపార్టీ హామీ నెలబెట్టుకుంటుంది. అంటూ ఒకటి కాదు రెండు కాదు పదిహేడేండ్లుగా బి.కొత్తకోట వాసు లను రాజకీయ పార్టీలు ఊరిస్తూనే ఉన్నాయి. ఏ పార్టీ ప్రభుత్వం వచ్చి నా కలగానే మిగులుతోంది తప్ప, అమలుకు నోచుకోవడం లేదు. ఆర్టీసీ డిపో ఏర్పాటు జరిగింది లేదు. బి.కొత్తకోట పట్టణ, మండల ప్రజలే కాకుండా పొరుగు మండలాలైన పీటీఎం, ములకలచెరువు, కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూనే ఉన్నా వారి ఆశలు ఫలించడంలేదు.

2006లో ఆర్టీసీ డిపో రద్దు

బి.కొత్తకోట ఆర్టీసీ డిపోను నష్టాల సాకుతో 2006 డిసెంబర్‌ 31 న రద్దు చేశారు. మరుసటి రోజే ఆర్టీసీ గ్యారేజ్‌లో ఉన్న సామగ్రిని తర లించేశారు. దీనిని నిరసిస్తూ అప్పట్లో అఖిలపక్ష నాయకులు, ప్రజా సం ఘాలు ధీక్షలు, ధర్నాలతో పాటు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టా రు. అప్పట్లో ఉమ్మడి ఆంద్రప్రదేశలోని పుంగనూరుతో సహా 14 డిపోల ను రద్దు చేశారు. ఆపై ఒక్కొక్కటిగా బి.కొత్తకోట మినహా అన్ని పునః ప్రారంభమయ్యాయి. అధికారులు, పాలకులు హడావుడి చేయడం తప్ప ఆర్టీసీ డిపో ప్రారంభానికి నోచుకోలేదు.

ఎంపిక చేసిన స్థలాలు ఎన్నో ..

బి.కొత్తకోట ఆర్టీసీ డిపో ప్రారంభం అవగానే శాశ్వత ప్రాతిపదికన ఆర్టీసీ బస్టాండ్‌, గ్యారేజ్‌ నిర్మాణం కోసం మదనపల్లె రోడ్డులో ఓ దాత రెండు ఎకరాల స్థలాన్ని సంస్థకు విరాళంగా రాతపూర్వకంగా ఇచ్చాడు. అయితే ఈ స్థలంలో తాత్కాలిక బస్సు షెల్టర్‌, సరిహద్దులను దిమ్మె లను మాత్రమే నిర్మించి ఊరుకున్నారు. ఇచ్చిన స్థలాన్ని ఏళ్ల తరబడి సద్వినియోగం చేసుకోక పోవడంతో ఆ దాత ఆ విరాళాన్ని రద్దు పరు చుకున్నాడు. పీటీఎం రోడ్డులోని దేవాదాయ శాఖ స్థలాన్ని డిపో నిర్మా ణం కోసం ఎంపిక చేశారు. అయినా అది కూడా కార్యరూపం దాల్చ లేదు. లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పఽథంతో ప్రయత్నాలు చేసిఉంటే డిపో ప్రారంభం అయిఉండేది.

డిపో మూతతో సమస్యలెన్నో..?

బి.కొత్తకోట ఆర్టీసీ డిపో రద్దు చేయడంతో బి.కొత్తకోట పట్టణానికి మం డలంలోని వివిధ గ్రామాలతో పాటు పీటీఎం, ములకలచెరువు మండ లాలు, సరిహద్దున ఉన్న దాదాపు 30 కర్ణాటక గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. రైతులు తమ వ్యవసాయ ఉత్ప త్తులను తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేల హామీ నెరవేరేనా..!

ప్రస్తుత ఎంపీ, ఎమ్యెల్యేలు ఎన్నికల సమయంలో బి.కొత్తకోటలో ఆర్టీసీ డిపోను మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. గతంలో సాయిప్రతాప్‌ ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నికల ముందు డిపో ప్రారంభించేశామంటూ, బి.కొత్తకో టలో సభ పెట్టి హడావిడి చేశారు. కొన్ని బస్సులకు సైతం బి.కొత్తకోట డిపో లోగోను వేసి తిప్పారు. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. ప్రస్తుత ఎమ్యెల్యే ద్వారకనాథ్‌రెడ్డి సైతం ఆర్టీసీ అధికారులతో ఇటీవల డిపో ఏర్పాటుపై చర్చలు జరపడం ఆర్టీసీ అధికారులు దేవాదాయ శాఖ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. త్వరలో ఆ స్థలం కేంద్రంగా డిపో పునః ప్రారంభం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఇది జరిగి రెండు నెలలైనా కార్యరూపం దాల్చింది లేదు. ఈ సారైనా ఎన్నికల హామీ నెరవేరేనా అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

దేవదాయ శాఖ కమిషనర్‌ వద్ద పైల్‌ పెండింగ్‌లో ఉంది

బి.కొత్తకోటలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు దేవాదాయ శాఖ స్థలాన్ని పరిశీ లించాం. ఆస్థలం ఖాళీగా లేదు. ఇటుక బట్టీలతో నిండి ఉంది. ఖాళీ చేయించి ఇస్తామన్నారు. రూ. 1.80 లక్షలు అద్దె చెల్లిస్తామని, మూడే ళ్లకు ఒకసారి 10 శాతం పెంచుతామని చెబుతున్నాం. అయితే 30 శాతం పెంచాలని దేవదాయ శాఖ అధికారులు అడుగుతున్నారు. ప్రస్తు తం పైల్‌ దేవదాయ శాఖ కమిషనర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. వారి నిర్ణయం ప్రకటిస్తే సంబందిత స్థలంలో పనులు ప్రారంభిస్తాం.

- రాము, రీజనల్‌ మేనేజర్‌ రాయచోటి

Updated Date - Jan 29 , 2024 | 11:38 PM

Advertising
Advertising