ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే నైతికత కమలాపురం ఎమ్మెల్యేకు లేదు

ABN, Publish Date - Jan 21 , 2024 | 11:19 PM

కాంగ్రెస్‌ పార్టీ హయాంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌, మేయర్‌ లాంటి పదవులు పొందిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి తల్లి లాంటి ఆ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు విమర్శించారు.

మాట్లాడుతున్న జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జి. శ్రీరాములు

కడప(కలెక్టరేట్‌), జనవరి 21: కాంగ్రెస్‌ పార్టీ హయాంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌, మేయర్‌ లాంటి పదవులు పొందిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి తల్లి లాంటి ఆ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు విమర్శించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు విష్ణుప్రీతంరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పర్యటనను విజయవంతం చేసిన ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌ రెడ్డి కాంగ్రెస్‌ను విమర్శించడం అర్థ రహితమన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనే నీ రాజకీయ ప్రస్థానం సాగిందనే విషయాన్ని మరిచి పోవద్దన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా కాంగ్రెస్‌ను తక్కువ చేసి మాట్లాడవద్దన్నారు. మరో 10 రోజుల్లో పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలమ్మ జిల్లా పర్యటన ఉంటుందని, ప్రతి కార్యకర్తను ,నాయకులను కలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్‌ పొట్టి పాటి చంద్ర శేఖర్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు అలీఖాన్‌, ద్రువకుమార్‌రెడ్డి, పాలగిరి శివ,సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 11:19 PM

Advertising
Advertising