జనసేన, టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి
ABN, Publish Date - Jan 29 , 2024 | 10:10 PM
రాష్ట్రం అభివృద్ధి సాఽ దించాలంటే జనసేన, టీడీపీతోనే సాధ్యమవు తుందని మాజీ జెడ్పీటీసీ యల్లటూరు శివరామ రాజు తెలిపారు
నందలూరు, జనవరి 29: రాష్ట్రం అభివృద్ధి సాఽ దించాలంటే జనసేన, టీడీపీతోనే సాధ్యమవు తుందని మాజీ జెడ్పీటీసీ యల్లటూరు శివరామ రాజు తెలిపారు. జనంలోకి జనసేన కార్యక్రమం లో భాగంగా సోమవారం నూకినేనిపల్లె, బలిజ పల్లె, బలిజపల్లె ఎస్సీ కాలనీ, కుంపినీపురంలలో ప్రచారం నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను అడి గి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృ షి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ ఎ న్నికల గుర్తు గాజు గ్లాసు ప్రజలకి చేరువైంద న్నారు. జెడ్పీటీసీ కో-ఆప్షన్ మాజీ సభ్యుడు షబ్బీర్ అహమ్మద్, విశ్రాంత ఎస్‌ఐ కడిమెళ్ల శ్రీనివాసరాజు, నాయకులు ఆకుల చలపతి, భారతాల ప్రశాంత్, గురివిగారి వాసు, తిప్పాయ పల్లె ప్రశాంత్, వెలకచర్ల హరిబాబు, మంటి వెంకటసుబ్బయ్య, బత్యాల వినయ్, పైడికొండ్ల సునీల్ గౌడ్, నందు, వెంకటేష్, బాలాజీ, సుధా కర్, రవీంద్ర, కార్తీక్, శ్రీను, యానాది, రాము పాల్గొన్నారు.
జనసేనతోనే మార్పు సాధ్యం
సుండుపల్లె: జనసేన, టీడీపీ కలయికతో రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని జనసేన నాయకులు వంటేరు రాజా, సలీం తెలిపారు. మండలంలోని రాయవరం పంచాయతీ కావలి పల్లెలో సోమవారం జనంలోకి జనసేన కార్యక్ర మం నిర్వహించారు. జనసేన పార్టీతోనే మా ర్పు సాధ్యమని తెలిపారు. అసెంబ్లీ ఇన్‌చార్జి మలిశెట్టి వెంకట్రమణ ఆధ్వర్యంలో జీ. రెడ్డి వారిపల్లె, గుండ్లపల్లెల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించినట్లు ఆ పార్టీ నాయకురాలు సుగుణ మ్మ తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 10:10 PM