ఆదర్శప్రాయుడు శ్రీ కృష్ణదేవరాయలు
ABN, Publish Date - Jan 17 , 2024 | 11:22 PM
విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ కృష్ణదేవరాయలు నేటి పాలకు లకు ఆదర్శప్రాయుడని ఎంఎల్‌సి సి.రామచంద్ర య్య, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి. హరి ప్రసాద్, జనసేన ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్ సుంకర శ్రీనివాస్ పేర్కొన్నారు.
జయంతి వేడుకలో సీఆర్‌సీ
మూడు నెలల్లో శ్రీకృష్ణదేవరాయల పాలన రాబోతోంది : బీటెక్ రవి
కడప (మారుతీనగర్ ) జనవరి 17: విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ కృష్ణదేవరాయలు నేటి పాలకు లకు ఆదర్శప్రాయుడని ఎంఎల్‌సి సి.రామచంద్ర య్య, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి. హరి ప్రసాద్, జనసేన ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్ సుంకర శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీ కృష్ణదేవరాయలు 533వ జయంతిని పురస్కరించుకుని ఆర్టీసీ కడప డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కండక్టర్ సగినాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక కళాక్షేత్రం లో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో శ్రీకృష్ణదేవరాయ లు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘననివాళుల ర్పించి మాట్లాడారు. రాయలసీమను రతనాలసీమ గా ఖ్యాతినార్జించేలా పాలన సాగించిన ధీరుడిగా శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు అమరప్ప, దుర్గాప్రసాద్, నేతలు తోట కృష్ణ, తుమ్మలకుంట శివశంకర్, ఎస్. మునెయ్య, వెంకటరమణ, మస్తాన్, రాము, కొండయ్య, తదితర నేతలు పాల్గొన్నారు.
అఖండ భారతదేశ చక్రవర్తి
అఖండ భారతదేశ చక్రవర్తుల్లో ప్రధముడు శ్రీకృష్ణదేవరాయలు అని అఖిల భారత యాదవ మహాసంఘం నేతలు అన్నారు. కృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా క్రిష్ణసర్కిల్‌లో శ్రీకృష్ణదేవరా యలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ప్రతాప్ యాదవ్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస మూర్తియాదవ్ మాట్లాడారు.
త్వరలో శ్రీకృష్ణదేవరాయల పాలన : బీటెక్ రవి
పులివెందుల టౌన్, జనవరి 17: ఏపీలో మరో మూ డు నెలల్లో శ్రీకృష్ణదేవరాయల పాలన రాబోతోందని మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) అన్నారు. పూలంగల్ల సర్కిల్ వద్ద శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించిన ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల హయాం లో రాయలసీమకు చేసిన సేవలను గుర్తుచేశారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ రాజధాని లేని ప్రాం తంగా రాష్ట్రాన్ని మార్చాడని ఆవేదన వ్యక్తం చేశా రు. మరో మూడు మాసాలలో చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయల పాలన రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. 19వ తేదీన చంద్రబాబునాయుడు కమలాపురంలో పర్యటిస్తు న్నారని, ఆయన పర్యటన విజయవంతం చేయాల ని టీడీపీ నేతలు, కార్యకర్త లకు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీకృష్ణదేవరాయలుకు ఎంపీ నివాళులు
విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు కు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఘన నివాళుల ర్పించారు. పాత పంచాయతీ కార్యాలయం వద్ద గల శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహానికి నివాళులర్పించి న ఎంపీ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల పరిపాల న నేటి నేతలు, పాలకులకు స్ఫూర్తిదాయకమన్నారు.
సింహాద్రిపురంలో....
సింహాద్రిపురం, జనవరి 17: శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు బలిజ సంఘం అధ్యక్షుడు తు పాకుల రాఘవేంద్ర ఆధ్వర్యంలో బుడ్డయ్యపాళెంలో నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయులు చిత్ర పటానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఉపాధ్యక్షుడు ఇండ్ల రామకృష్ణ, సభ్యులు ఇండ్ల కుమార్, శ్రీనివా సులు, టీరాజులు, సాంబశివుడు, రమణ, రామాంజ నేయులు, డాక్టర్ సాయి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 17 , 2024 | 11:22 PM