ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

ABN, Publish Date - Jan 09 , 2024 | 10:59 PM

ముత్యాల ముగ్గులు, భోగి మంటలు, గొబ్బిళ్లు, సంప్రదాయ దుస్తులతో రాయలసీమ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిం చారు.

బోగి మంటలు వేసి గొబ్బిళ్లు తడుతున్న విద్యార్థినులు

రాజంపేట టౌన్‌, జనవరి9: ముత్యాల ముగ్గులు, భోగి మంటలు, గొబ్బిళ్లు, సంప్రదాయ దుస్తులతో రాయలసీమ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిం చారు. ప్రిన్సిపాల్‌ కొండపల్లి కల్పన, డైరెక్టర్లు కృష్ణచైతన్య, సూర్యచైతన్య ఆధ్వర్యంలో విద్యార్థినులు తెలుగుదనం ఉట్టిపడేలా దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఫిజికల్‌ డైరె క్టర్‌ ఆదినారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నందలూరులో....

నందలూరు, జనవరి9: ముందస్తు సంక్రాంతి వేడుకలను జ్ఞాన దీప్తి పాఠశాల కరస్పాండెంటు అద్దంకి జానకినాధ్‌, ప్రధానోపాధ్యాయులు లక్షుమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులతో బోగిమంటలను ఏర్పాటు చేసి గొబ్బెమ్మ పాటలు పాడారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులకు గాలిపటాలను పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు రమణ, వినయ్‌, సురేష్‌, తులసీరామ్‌, సాధిక్‌బాష, పద్మ, నాగరత్న, దివ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

సిద్దవటంలో ఘనంగా ముందస్తు సంక్రాంతి

సిద్దవటం, జనవరి9: బ్రాహ్మణవీధిలోని హైస్కూలులో ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. విద్యా ర్థులు తయారు చేసిన హరిదాసు, గొబ్బెమ్మ వృషభాలు, గడ్డితో తయారు చేసిన పూరిపాకలు చూపరులను ఆకట్టు కున్నాయి. అధ్యాపకులు పోలు వెంకటసుబ్బయ్య పిల్లలకు సంక్రాంతి పండుగ విశిష్టతను తయారు చేసి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - Jan 09 , 2024 | 10:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising