పాలేగాళ్ల వ్యవస్థను వారసత్వ సంపదగా గుర్తించాలి
ABN, Publish Date - Jan 12 , 2024 | 11:51 PM
రాష్ట్రంలోని పాలేగాళ్ల వ్యవస్థను పరిరక్షించి దానిని వారసత్వ సందగా గుర్తించాలని పాలేగాళ్ల వారసుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎను గొండ కేశవులు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పీలేరు, జనవరి 12: రాష్ట్రంలోని పాలేగాళ్ల వ్యవస్థను పరిరక్షించి దానిని వారసత్వ సందగా గుర్తించాలని పాలేగాళ్ల వారసుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎను గొండ కేశవులు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీలేరు మండలం తలపుల పంచాయతీ అడవిపల్లె వద్దనున్న మద్గుండా ల మల్లేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పాలేగాళ్ల వారసుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కాకతీయ, విజయనగర, గోల్కొండ, మొగల్, మరాఠా పాలకుల కాలంలో రాయ లసీమ ప్రాంతంలో పాలేగారి వ్యవస్థ స్థానిక పాలనా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నిర్వహించిందన్నారు. ప్రముఖ రచయిత, చరిత్రకారుడు తువ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడు తూ పాలేగాళ్ల వ్యవస్థను నిర్వీర్యం చేసిన బ్రిటీషు పాలకులు నాటి పాలేగాళ్లకు పెన్షన విధానాన్ని అమలు చేసిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మరోమారు అధ్యయనం జరిపి పాలేగాళ్ల వారసులకు పెన్షన అందించాలన్నారు. కార్యక్రమంలో పాలేగాళ్ల సం ఘం నాయకులు గురిగింజకుంట చంద్రప్ప నాయుడు, జోతాల వెంకటరమణ నాయుడు, పందిళ్లపల్లె బలరామయ్య, జె.వెంకటరమణ నాయుడు, టీఎన పెద్దరెడ్డప్ప నాయుడు, ప్రభాకర నాయుడు, లక్ష్మీపతి నాయుడు, ఎల్లుట్ల సాంబశివనాయుడు, గుట్టపాళెం రెడ్డప్ప నాయుడు, పార్థసారథి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2024 | 11:51 PM