ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం

ABN, Publish Date - Nov 27 , 2024 | 12:21 AM

ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎంతో లాభదాయకమని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.

జీవామృతం తయారు చేసే విధానాన్ని రైతులతో పాటు ఎమ్మెల్యేకు వివరిస్తున్న వ్యవసాయాధికారులు

కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి

వల్లూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎంతో లాభదాయకమని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు. మంగళవారం చిన్నలేబాక గ్రా మంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులకు శిక్షణ ము గింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువులు వాడితే దిగుబడి పెరుగుతుందన్నారు. భూమి కూడా సారవంతంగా ఉంటుందన్నారు. కానీ రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతుండటంతో భూ మి బండబారి పోతోందని, నేలలోని మిత్రపురుగులు కూడా చనిపోయి తెగుళ్లు ఎక్కువవుతున్నాయని వివరించారు. ఎప్పుడైతే రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని అలవాటు చేసుకుంటారో పంటలు సమృద్ధి గా పండుతాయన్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు మంచి గిరాకీ ఉంటుందన్నారు. కావున వ్యవసా య అధికారులు, సిబ్బంది రైతులకు మంచి శిక్షణ అందిం చాలని, శిక్షణలో నేర్చుకున్న అంశాలకు రైతులు అలవాటు పడేలా చూడాలని సూచించారు. అనంతరం జీవామృతం తయారు చేసే విధానాన్ని వ్యవసా యాధికారులు వివ రించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నరసింహారెడ్డి, ప్రకృతి వ్యవసాయ డీపీఎం ప్రవీణ్‌కుమార్‌, స్థానిక ఏవో సాయిజ్యోతి, టీడీపీ మండల అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ రఘురాం, రైతులు సుబ్బారెడ్డి, ఓబులరెడ్డి, రామచంద్రారెడ్డి, భూషయ్య, మధు, చిన్నలేబాక గ్రామానికి చెందిన మధు, రెవెన్యూ, సచివాలయ, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 12:21 AM