తంబళ్ళపల్లెలో టీడీపీ జెండా ఎగురవేద్దాం..
ABN, Publish Date - Jan 09 , 2024 | 10:38 PM
సమష్టి కృషితో తంబళ్ళపల్లెలో టీడీపీ జెండా ఎగురవేద్దామని మాజీ ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పిలుపు
కురబలకోట, జనవరి 9: సమష్టి కృషితో తంబళ్ళపల్లెలో టీడీపీ జెండా ఎగురవేద్దామని మాజీ ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని అంగళ్లులో రాజంపేట పార్ల మెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళా ్లలన్నారు. వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, గుండాయిజం పెరిగిపోవడంతో పేదలు, సామాన్యులు స్వేచ్ఛగా బతకలేకపోతున్నా రన్నారు. బటన నొక్కుడుతో పేదలకు ఒరిగింది శూన్యమని, రాష్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. రానున్న ఎన్ని కల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కలసికట్టుగా కృషి చేయాలని, రాషా్ట్రభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఈ కార్య క్రమంలో పరిశీలకులు గురవారెడ్డి, రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్, శ్రీనివాసులు, రమణ పాల్గొన్నారు.
సైనికుల్లా పని చేయాలి
పెద్దమండ్యం: వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన పార్టీల గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని తంబళ్లపల్లి టీడీపీ ఇనచార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ పిలుపునిచ్చారు. పెద్దమండ్యంలో మంగళ వారం టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల సమన్వయ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కోరారు. నియోజకవర్గంలోని సమన్వయ కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యక్రమాలకు పూర్తి సమయం కేటాయించాలన్నారు. టీడీపీ మేని ఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు. జనసేనతో కలసి భూ ఆక్రమణలు నివారిస్తామన్నారు. ముందుగా ర్యాలీ నిర్వహించి టీడీపీ జెండాను ఆవిష్క రించారు. రాజంపేట పార్లమెంట్ టీడీపీ బీసీ అధ్యక్షుడు సురేంద్రయాదవ్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి బుక్కే మనోహర్‌నాయక్, రాజంపేట టీడీపీ ప్రధాన కార్యదర్శి దొరస్వామినాయుడు, టీడీపీ ఎస్టీ సెల్ నాయకుడు నటరాజ్ నాయక్, తంబళ్లపల్లి నియోజక వర్గం టీడీపీ అబ్జర్వర్ గురవారెడ్డి, నియోజక వర్గ జనసేన నాయకుడు సాయినాధ, నియోజక వర్గ మండల టీడీపీ, జనసేన అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2024 | 10:38 PM